నూతన జిల్లా అధ్యక్షుడు మధు కు మంత్రి అభినందనలు

నూతన జిల్లా అధ్యక్షుడు మధు కు మంత్రి అభినందనలు..
ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్సీ తాతా మధు ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి అభినంధనలు తెలియజేసారు.
హైదరాబాద్ లోని మంత్రి పువ్వాడ అధికారిక నివాసంలో తాతా మధు మర్యాపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన తాతా మధు కి శాలువా కప్పి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు.
ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చేందుకు మరింత కృషి చేయాలన్నారు.
జిల్లాలో అందుబాటులో ఉంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసి పార్టీని పటిష్టపర్చాలన్నారు. జిల్లాల అధ్యక్షుల నియామకంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొందని, దీనిని క్షేత్రస్థాయికి విస్తరించి, కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపే విధంగా నూతన అధ్యక్షులు పనిచేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..