యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కరోనా పాజిటివ్

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి కి కరోనా పాజిటివ్ తేలింది. ఈ నెల 24న పట్టణ అభివృద్ధి పై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులతో సమావేశం లో పాల్గొనడం, ఈనెల 25 ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి వనపర్తి లో గ్రామ సభ లోను పాల్గొనడం, ఈనెల 26న గణతంత్ర దినోత్సవ వేడుకలలోనూ, మరియు సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి ఉన్నతాధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజలతో కలిసి గ్రామాలలో పర్యటించినది. కలెక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో జిల్లాలో జిల్లా అధికారులు కలిసిన రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.