Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జానపాడ్ సైదన్న జాతరొచ్చే

 -మత సమైక్యతకు చిహ్నం జాన్పహాడ్ దర్గా

– తెలంగాణ , ఆంధ్రా రాష్ట్రాల నుండి భక్తుల రాక

– లక్షల్లో ఆధాయం- సౌకార్యాలు  శూన్యం .

-అరకొర వసతులు . – ఇక్కట్లు పాలవుతున్న భక్తులు .

-పట్టించుకోని  అధికారులు .

తెలంగాణ ప్రాంతంలో మత సామరస్యానికి ప్రతీకగా జాన్పహాడ్ దర్గా విరజిల్లుతుంది . నేరేడుచర్ల మండలకేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.  ప్రతి శుక్రవారం హిందూవులే అధికంగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు . రాష్ట్రంలోని ప్రముఖ దర్గాలలో జాన్పహాడ్ దర్గా పేరొందినది .

ప్రతి ఏటా  జనవరి 21 నుండి 31 తేదీలలో ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతాయి.  త్యాగానికి చిహ్నంగా ఈ దర్గా ను భక్తులు భావిస్తారు . ఉర్సు సందర్భంగా ఈ నెల 28 న హైద్రాబాద్ నుంచి గంధాన్ని ఇక్కడకి తీసుక వచ్చి జాన్పహాడ్ గ్రామంలో ఊ గంధాన్ని తాకినా , ఇంటికి తెచుకుని పెట్టుకున్నా మంది జరుగుతుందని భక్తుల నమ్మకం .

ఈ దర్గా చుట్టూ భక్తులు ‘ హనసరం ‘ పడుతుంటే కలలో దేవుడు దర్శనమిచ్చి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతారని ఇక్కడ భక్తుల నమ్మకం . దర్గాను దర్శించుకుంటే సంతానం కలుగుతుందని చెబుతుంటారు .

దర్గాకు సమీంలో ఏర్పడిన నాగ దేవత పుట్ట భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది . ఇక్కడికి వచ్చిన మహిళలు పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు . ఉర్సు సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా కులమతాలకతీతంగా భక్తులు వేలాదిగా తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు . జంతు  బలులు చేయడం ఇక్కడ అనవాయితి .

ఈ ఉర్సు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు .

దర్గా చరిత్ర …

సుమారు 400 ఏళ్లు క్రితం మద్రాస్ రాష్ట్రంలోని నాగర్ గ్రామంలో వెలిసిన నాగూరఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను ప్రక్క రాష్ట్రంలో ప్రచారం చేయాలని తలచి జాన్పహాడ్ సైదా , మోహినుద్దీన్ అనే భక్తులు ప్రక్క రాష్ట్రానికి చేరి నాగూర్ గొప్పతనం చాటుతూ ఊరూరు తిరగసాగారు . మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులైనారని కథనం ప్రచారంలో ఉంది .

దాంతో జాన్పహాడ్ సైదా జ్ఞాపకార్ధం వజీరాబాద్ రాజకుమారుడు జాన్పహాడ్ సైదా దర్గాను నిర్మించారని , పూర్వికులు చెప్పుతుండేవారు అని స్థానికులు చెబుతున్నారు . ఆ తరువాత ఈ దర్గాకు జానహాడ్ దర్గాగా వాడుకలోకి వచ్చింది .

దర్గా ప్రాంతమంతా అడవి కావడంతో తన దగ్గరికి వచ్చు భక్తులు బయపడకుండా ఉండడం కోసం ఇక్కడ నాగుపామును , పెద్దపులిని ఏర్పాటు చేశాడంటారు . ఇక్కడు పుట్ట ఉన్నచోట నేటికి భక్తులు పుట్టలో పాలు గుడ్లు వేసి పూజలు జరుపుతారు .

కనుమరుగైయిన గొల్లభామ …

మత ప్రచారం సందర్భంగా జరుగుతున్న యుద్ధ సమయంలో ఒక గొల్లభామ గుట్టకు వెళ్ళడానికి సరి అయిన మార్గం లేక పోవడంతో కనుమరుగవుతుంది .

సఫాయిబావి :

జాన్పహాడ్ దర్గాకు వచ్చు భక్తులు నీటి సౌకర్యం లేకా ఇబ్బంది పడుతున్న తరుణంలో సైదులు బాబా భూపతి రాజు శేషారెడ్డికి కలలో వచ్చి గుర్రపు డెక్కెలు ఉన్న చోట బావిని తవ్వించమని  చెప్పాడు . దీంతో ఆ ప్రదేశంలో బావిని తవ్వించారు . అదే జానపహాడ్ దర్గాకు వెళ్లే దారిలో కుడి వైపు ఉన్న ఒక దిగుడు బావి ఇది విచిత్రంగా ఒక గృహ వలనేకన్పిస్తుంది . భుక్తుల ఈ భావి నీటిని తెచ్చుకుని స్నానాలు చేస్తారు . ఈ నీటితోనే వంటలు వండుతారు .

ఇది చాలా పవిత్రమైన నీరున్న భావి.  ఈ భావి నీటి లో స్నానం చేయడం వల మానసిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం . ఈ భావిలోని నీటిని పంట పొలాలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని , ఈ నీరు తాగితే సర్వరోగాలు పోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు . కాని అధికారుల నిర్లక్ష్యంతో ఈ భావి శిథిలావస్థకు చేరుతుంది . వక్స్ బోర్డు అధికారులు స్పంధించి ఈ భావిని పునర్ నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు .

కొర్కెలు తీర్చే సిపాయి బాబా : 

సైదులు బాబాకు అంగరక్షకుడు ఉండే సిఫాయి బాబా మత ప్రచారంలో సైదులు బాబాతో పాట మరణించాడు . సైదులు బాబా దెగ్గర మొక్కులు చెల్లించుకొనే వారు సిపాయి బాబా దెగ్గర కూడా కొర్కెలు కోర్కొని మొక్కులు తీర్చుకుంటారు . సిపాయి బాబా దగ్గర ఒక విశిష్టత ఉంది . ఇక్కడ మనుషులోని కోర్కెలను కోరుకునే  వారు ఇక్కడ తాళం వేసి వెళతారు . వారి కొర్కెలు తీరిన తరువాత ఇక్కడకు వచ్చి వేసిన తాళం తీస్తారు . ఈ విధంగా భక్తుల కోర్కెలను తీర్పుతాడని నమ్మకం . కొంత మంది సిపాయి భాబాను తాళాల స్వామి అని కూడా పిలుస్తారని పలువురు చెబుతున్నారు .

 

జాన్పహాడ్ కేంద్రంగా మరో నాలుగు పహాడ్లు ….

ఇవి కూడా పాడుపేరు నుంచి పహాడ్లుగా మారాయని గ్రామస్తులు చెబుతారు . ఇవి మొత్తం ఐదు గ్రామాలు జాన్పహాడ్ ,  గుండ్లపహాడ్ , శూన్యపహాడ్ , గణేషపహాడ్ , రావిపహాడ్.  ఈ ఐదు పహాడ్లు పంచ భూతాలకు సంకేతాలని నమ్మకం . ఈ ప్రాంతంలో మరెక్కడ కూడా ఇలాంటి పేరుతో ఐదు గ్రామాలు కానరావు . ఈ గ్రామాలన్నిటిని సైదులు బాబానే కాపాడుతారని ఈయా గ్రామస్తుల నమ్మకం .

కందూరు :

జాన్పహాడ్ దర్గా వద్ద శుక్రవారాలలో దర్శనానికి ఉర్సు ఉత్సవానికి వచ్చి ఇక్కడే తీర్పు మొక్కును కందూరు అంటారు . కందూరు మొక్కులలో మేకపోతును , గోర్రెపోటీలను నైవేధ్యం ఇవ్వడం ఆచారంగా వస్తుంది . భక్తులు తమ మొక్కుల ప్రకారం వాటిని తీసుకవచ్చి వాటికి స్నానం చేయించి అలాలు చేయించి సపాయి బావి నీటితో వండుతారు . నైవేధ్యం చేస్తారు . మొక్కుకునే వారు మూడు ఇస్తరాకులలో దర్గా దగ్గర ఫాతేహ చేస్తారు . మిగిలిన ప్రసాదాన్ని స్నేహితులకు , బంధువులకు పంచి పెడతారు . ఇది చాలా పవిత్రంగా భావిస్తారు .

అసౌకర్యాల నిలయం : 

తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు కాకుండా ప్రక్క రాష్ట్రమైయిన ఆంద్ర నుంచి కూడా వేలాదిగా తరలివచ్చే భుక్తుల నుంచి లక్షలాది రూపాయల ఆదాయం సమకూరుతున్నప్పటికి దర్గా అభివృద్ధికి మాత్రం నోచుకోవడం లేదు . వక్ఫు  బోర్డు కేవలం సిబ్బంది జీత భత్యాలకు మాత్రమే ఖర్చు చేస్తూ దర్గాలో సౌకర్యాలకు ఏ మాత్రం కృషి చేయడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు . భక్తుల ఆదరణ ఎంత ఉన్నా వర్ఫ్ బోర్డు మాత్రం ఈ దర్గాను పట్టించుకోవడం లేదు . భక్తులకు దర్గా వద్ద కనీస సౌకర్యాలను కల్పించడంలో వక్ఫు బోర్డు  పూర్తిగా విఫలమైందని విమర్శలున్నాయి . భక్తులు సత్రాలు లేక చెట్ల కిందనే దుమ్ము , దూళి మధ్య వంటలు చేసుకోని భోజనాలు చేయాల్సిన పరిస్థితి.   భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసి భక్తులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దడానికి వక్స్ బోర్డు అధికారులు కృషి చేయాలన్నారు . తెలంగాణ ప్రభుత్వం దార్గా అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు .