భక్తుల సౌకర్యాలకు నీళ్ళొదిలినట్లేనా.?
*భక్తుల సౌకర్యాలకు నీళ్ళొదిలినట్లేనా??*
కృష్ణ,జనవరి 27, (నిజం న్యూస్ )
పెనుగంచిప్రోలు దేవస్థానం రాష్ట్రంలోనే గొప్ప దేవాలయాల్లో ప్రముఖంగా పేరొందింది. ఇక్కడికి భక్తులు కృష్ణా జిల్లా నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి వస్తారు. ముఖ్యంగా తిరునాళ్ల సమయంలో భక్తుల రద్దీ మరింతగా ఉంటుంది. భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయంటే తీర్ధ క్షేత్రాల్లో కొలువై ఉన్న దేవాలయాలలో దగ్గరలో ఉన్న నదిలో కాని, ఏరులో గాని స్నానం చేసి ఒడ్డున పొంగళ్ళు చేసుకొని దేవాలయాన్ని సందర్శిస్తారు. అయితే పెనుగంచిప్రోలు దేవాలయానికి ఏటికి మధ్య సుమారు అర కిలోమీటర్ దూరం ఉంటుంది.భక్తులు ఏరులో స్నానం చేసి దేవాలయానికి రావడానికి అంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది, కానీ కొందరు అక్రమ వ్యాపారులు ఏరు మధ్యలో పాకలు వేసి, ఏటి నీటి ప్రవాహాన్ని ప్రొక్లైన్ తో అడ్డుకట్టవేసి ఏటి నీటిని దేవాలయానికి దూరంగా కిలోమీటర్ దూరం పంపించి వేస్తున్నారు. తద్వారా భక్తులు స్నానాలు చేసిన తర్వాత గుడి దగ్గర దేవాలయంలో అధికారికంగా పాటలు పాడి లక్షలకు లక్షలు వడ్డీలకు అప్పులు తెచ్చి దేవస్థానానికి ఆదాయం ఇచ్చే పొంగళ్ళ షెడ్లకు రాకుండా అనధికారికంగా అక్రమంగా ఏర్పాటుచేసిన పాకలలో భక్తులు గత్యంతరం లేక పాలు పొంగించుకునే పరిస్థితి కల్పిస్తున్నారు.భక్తులకు అసౌకర్యం కల్పిస్తున్నారు. దేవాలయానికి చెందవలసిన ఆదాయం అనధికార అక్రమ వ్యాపారుల జేబుల్లోకి వెళుతుంది. భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. దేవాలయ అధికారులు, గౌరవ స్థానిక శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ తదితరులు ఈ విషయంపై పూర్తి గా ఆలోచించి ఏరు లో పారే నీటిని తోటల వైపు అడ్డుకట్టవేసి దేవాలయానికి దగ్గరగా నీరు ప్రవహించే విధంగా చేస్తే భక్తులు స్నానం చేసి వెంటనే ఒడ్డున ఉన్న దేవాలయ అధికార పొంగళ్ళ షెడ్లలో పొంగళ్ళు చేసుకొని అమ్మవారిని దర్శించుకుని సంతృప్తి చెందుతారు. దీనిపై అధికారులు ఏం చేస్తారో వేచి చూద్దాం…..