ఎపి సేవా పోర్టల్ ప్రారంభం

ఎపి సేవా పోర్టల్ ప్రారంభం

ఏ సచివాలయం నుండైనా దరఖాస్తులు

వేగంగా ధృవ పత్రాలు జారీ

దరఖాస్తు దారుకు ఎస్.ఎం.ఎస్.

ఎపి సేవా పోర్టల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించి ప్రజలకు అందుబటులోకి తెచ్చారు. ఏపి సేవా పోర్టల్ (గ్రామ, వార్డు సచివాలయాల సేవా పోర్టల్) ప్రారంభంతో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

తాడేపల్లి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన నూతనంగా ఏర్పాటు చేసిన సిటిజన్ (పౌర సేవల) పోర్టల్ ను గురు వారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సేవల పోర్టల్ ప్రారంభం వలన (ఎపి సేవా పోర్టల్) మారు మూల గ్రామాల్లో కూడా జవాబుదారి తనంపెంచేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.
గ్రామ స్వరాజ్యం వైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందనుటకు నిదర్శనమన్నారు. 540 పైగా పౌర సేవలు అందిస్తుందని, గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వాలంటీర్లు సుమారు 4 లక్షల మంది ఉన్నారని వారి ద్వారా సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ఈ సేవలను మరింత మెరుగు పరిచేందుకు ఈ పోర్టల్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పోర్టల్ వలన జవాబుదారి తనం పెరుగేందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలలో ద్వారా 3.45 కోట్ల మందికి మేలు చేయడమైనదని, ఈ సేవలు మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగంలోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.

దరఖాస్తు పెట్టుకున్న తర్వాత సంబంధిత పథకం లేదా సర్టిఫికెట్లు మంజూరు అయినది, తిరస్కరణకు సంబంధించిన సమాచారం సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుందని తెలిపారు.

ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తీసుకొనే వెసులుబాటు ఉంటుందని, త్వరితగతిన సేవలు అందుతాయని తెలిపారు. ఈ పోర్టల్ లో రెవెన్యూ, భూ పరిపాలన, తదితరమైన సేవలు అందుబాటులోకి తీసుకురావడమైనద్నారు. రాష్ట్రంలోని ఏ సచివాలయాలకు వెళ్లైన దరఖాస్తు పెట్టుకోవచ్చు,

దరఖాస్తు ఏ స్థాయిలో, ఎవరి వద్ద ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఈ పోర్టల్ ప్రారంభంతో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పారు.

అనంతరం సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ యూనీఫారంను అందజేశారు.