గణతంత్ర సాక్షిగా… టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు
చర్ల మండలం టిఆర్ఎస్ పార్టీ లో గణతంత్ర సాక్షిగా విభేదాలు భగ్గుమన్నాయి రోజురోజుకు తారాస్థాయికి చేరుకుంటున్నాయి గణతంత్ర వేడుకలు సంబరాలు జరుపుకున్న నాయకులు .
కార్యకర్తల మధ్య బుధవారం తీవ్ర వివాదం చోటు చేసుకుంది సాక్షాత్తు పార్టీ కార్యాలయంలో చోటు చేసుకొన్న ఈ భేదాలు జనాల సాక్షిగా జరగడం పార్టీకి తీవ్రనష్టం కలిగే విధంగా ఉంది. ప్రభుత్వ పథకాలు వివరించి, పార్టీని బలోపేతం చేయవలసిన నాయకులు ఇలా రోడ్డు ఎక్కటం చర్చకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో ఉన్న పటేలు వెంకటేశ్వరరావు చేరికపై పార్టీలో ఈ రచ్చ మొదలైంది. ఇప్పటికీ రెండు వర్గాలుగా చీలి అధికార పార్టీ పరువు తీసింది అంటూ జనం చర్చించుకుంటున్నారు.
వ్యక్తిగత కక్షలతో కొందరు పార్టీ పరువును బజారుకు ఈడుస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి మండల కమిటీ ఎన్నికలతో పాటు పట్టణ కమిటీ ఎన్నికల వరకు సాగిన విభేదాలు పార్టీలో మరింత విభేదాలను రేకెత్తిస్తున్నాయి. పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ విభేధాలు వర్గ విభేదాలను రాజేస్తోందని తేటతెల్లంగా అర్థం అవుతోంది. టిఆర్ఎస్ అధికార పార్టీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు సమన్యాయం చేసే దిశగా ముందుకు పోతూ ఉండగా పార్టీ మండల నాయకత్వంలో విస్పోటనంలా రగులుతున్న విభేదాలు పార్టీకి అన్ని విధాల నష్టం చేకూర్చడం తప్పదు అని రాజకీయ విశ్లేషకులు ఘంటా పదంగా చెప్పుకొంటున్నారు.
ఇలాగే విభేదాలు కొనసాగితే ప్రతిపక్ష పార్టీలకు లాభాలు చేకూర్చడం ఖాయంమనిపిస్తోంది. ఇప్పటికైనా వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి సారించకుంటే గతంలో మాదిరిగానే ఎమ్మెల్యే ఎన్నికల్లో నష్టం చవి చూడవలసిన పరిస్థితి ఎంతైనా ఉండే అవకాశం ఉంది. తెరాస నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న సమయంలో ప్రజల సాక్షిగా ఈ రభస సాగింది