రాజ్యాంగ సవరణతోనే ఉచిత పథకాలకు చెక్

కేంద్రప్రభుత్వమే చొరవ తీసుకోవాలి
రాజకీయ నిపుణులు, మేధావుల అబిప్రాయం
పార్టీలు ప్రకటించే ఉచిత పథకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని నిపుణులు, ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. కేంద్రంలోని ప్రబుత్వం కూడా ఉచిత పథకాలను సవిూక్షించి చట్టం చేయకుంటే దేశం దివాళా తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
బ్యాంకులను ముంచి పారిపోయిన నీరవ్ మోడీ, విజయ్ మాల్యాల లాగే వ్యవహరిస్తే బ్యాంకుల దివాళా లాగా దేశం కూడా దివాళా తీస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పథకాలకు పరిమితులు విధిస్తూ నిబంధనలు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
అనుత్పాదక వ్యయాలు కాకుండా.. ఉత్పాదక వ్యయాల విషయంలోనే పథకాలను అమలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇకపోతే పనిదినాలు కల్పించాలని చేపట్టిన ఉపాధిహావిూ పథకం కూడా దివాళా పథకంగా మారింది. వేలకోట్లు ఖర్చు చేస్తున్నా సమగ్రంగా పనులు జరగడం లేదు.
ఉచిత పథకాలను ఇలాగే కొనసాగిస్తే కొంపముంచుతాయని హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్టాల్రతో పాటు ఢల్లీి, పంజాబ్, బెంగాల్ తదితర రాష్టాల్ల్రో అనుత్పాదక పథకాలకు వేల కోట్ల రూపాయలను వెచ్చించాల్సి వస్తుండడంతో మౌలిక సదుపాయాల కల్పన పడకేస్తోంది. అలాగే పథకాలను కొనసాగించేందుకు వేలకోట్లు అప్పులు చేయాల్సి వస్తోంది.
ఉచిత టీవీలు, ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు, కుట్టు మిషన్లు ఇలా అనేకానేక వస్తువులు ఇస్తామంటున్న పార్టీలు రేపు ఉచితంగా మద్యం, 10 గ్రాముల బంగారాన్ని పంపిణీ చేస్తామంటూ పథకాలను ప్రవేశపెట్టినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
ప్రజలకు ఉచితంగా ఇవ్వద్దని రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి అన్ని పార్టీల ప్రభుత్వాలు ఉచిత పథకాలను జోరుగా అమలు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని కేంద్ర ఎన్నికల సంఘం కట్టడి చేయలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకుని కట్టడి చేసేలా ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తేవాల్సిన అసవరం ఏర్పడిరదని మేధావులు సూచిస్తున్నారు.
విద్య, వైద్యం వంటి పేదల సంక్షేమానికి సంబంధించిన రంగాల్లో ఉచితాల అసవరం ఉంది. వీటికి డబ్బులు వెచ్చించాల్సిందే.
ఉచిత పథకాలకు పరిమితులు ఉండాలని రాజకీయ నిపుణులు సైతం సూచిస్తున్నారు. పన్నుల ద్వారా ప్రజల నుంచి వసూల్లు చేసిన డబ్బును ఉచిత పథకాలకు కేటాయిస్తూ.. మౌలిక సదుపాయాలకు రాష్టాల్రు అప్పులు చేస్తున్నాయి.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి అప్పు కోసం కేంద్రాన్ని దేబిరిస్తున్నాయి. ఉచిత పథకాలకు నిధులను ధారపోయకుండా ఇలాంటి మౌలిక సదుపాయాలకు వెచ్చిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం చట్టం చేసి పరిమితులు విధించేలా రాజ్యాంగ సవరణలు చేయాలని అంటున్నారు.