Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సుప్రీం హెచ్చరికలతో ప్రజలే మేల్కోవాలి ! 

ప్రజలు అభివృద్దిని కోరుకుంటుంటే..పాలకులు అధికారం కోరుకుంటున్నారు. ఎంతకు తెగించి అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా అనేకానేక ఉచిత పథకాల హావిూలను గుప్పిస్తున్నారు. ఆదాయ వ్యయా లను పరిగణనలోకి తీసుకోకుండా చేస్తున్న విన్యాసాలతో దేశ,రాష్టాల్ర ఆర్థిక ముఖచిత్రం మారిపోతోంది.

అభివృద్ది పడకేస్తోంది. నిరుద్యోగం పెరుగుతోంది. వస్తూత్పత్తి పడిపోతోంది. నిరంతరంగా ఏదో ఒక పథకం పేరుతో నగదు బదిలీలు జరుగుతున్నాయి. దీనికి కాంగ్రెస్‌, బిజెపిలతో పాటు ప్రాంతీయ పార్టీలన్నీ బరి తెగగిస్తున్నాయి. పేదరికం నుంచి ప్రజలను బయటపడేసే ఉద్దేశ్యంతో చేస్తున్న ఆర్భాటాలతో పథకాలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నాయి.

నగదు బదిలీ పథకాలతో బొక్కసం గుల్ల చేస్తున్నారు. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థితిలో ఉండడం లేదు. ఉపాధి, ఉద్యోగరంగాలను బలోపేతం చేసే చర్యలు చేయడం లేదు. అలాగే ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నా అందుకు అనుగుణంగా వ్యవసాయాధారిత పరిశ్రమలతో ఆదుకోవడం లేదు. ఉన్న పరిశ్రమాలను మూసతేస్తున్నారు. లాభాల బాటలో ఉన్న సంస్థలను తెగనమ్మేస్తున్నారు.

దేశంలో ప్రజలు అన్నమో రామచంద్రా అంటున్నా పట్టించుకోవడం లేదు. రైతుబంధు, ఉచిత విద్యుత్‌, ఉపాధిహావిూ, కిలోరూపాయి బియ్యంలాంటి పథకాలన్నీ దండగమారివే అయినా కొనసాగి స్తున్నారు. 73వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ సుప్రీంలో దాఖలయిన ఓ పిటిషన్‌ ఆధారంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు మార్పునకు నాందీప్రస్తావన కావాలి. పేద ప్రజలకు తాము అధికారం లోకి వస్తే ఉచిత పథకాలతో లబ్దిచేకూరుస్తామని రాజకీయ పార్టీలు, నేతలు, ఎన్నికలవేళ చేస్తున్న వాగ్దానాల పట్ల సుప్రీం కోర్టు కన్నెర్ర చేసింది.

ఉచిత వాగ్దానాలు సాధారణ బడ్జెట్‌ను మించి ఉంటున్నా యని, ఇలాంటి జనా కర్షక హావిూలు గుప్పించడం తీవ్రమైన అంశమని పేర్కొంది. ఇకనుంచైనా ఉచిత వాగ్దానాల వర్షం కురిపించే రాజకీయ పక్షాలను, నేతలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. దీనిపై తమ వైఖరి తెలియ జేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది.

నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హావిూలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింపజేయాలని, రిజిస్టేష్రన్‌ª`ను రద్దు చేయాలని న్యాయవాది అశ్విన్‌ ఉపాధ్యాయ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. త్వరలో ఐదు రాష్టాల్ల్రో  జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలతో ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎఎస్‌ బోపన్న, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో, చట్టబద్ధం గా ఎలా నియంత్రిం చాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఈ పరిస్థితిని నిరోధించేందుకు సాధ్యమవుతుందా..? అని ప్రశ్నించింది.

ఉచిత హావిూల బడ్జెట్‌ సాధారణ బడ్జెట్‌ను మించిపోతోందని జస్టిస్‌ ఎన్‌వి రమణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పట్టాయి. ఓటర్ల నుంచి రాజకీయ లబ్ది పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇ

ది చాలా తీవ్రమైన సమస్య అంటూ…మార్గదర్శకాలను రూపొందించాలని గతంలో ఎన్నికల సంఘానికి సూచించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్‌ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినప్పటికీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను కోరుతూ ఎన్నికల సంఘం కేవలం ఒక సమావేశాన్ని మాత్రమే నిర్వహించిందన్నారు.

రాజకీయం అధికారం కోసం… అధికార వనరుల పై పెత్తనం కోసం చేస్తున్న విన్యాసాలే ఈ ఉచిత పథకాలు గా చెప్పుకోవాలి. ఎపిలో నిరంతరాయంగగా డబ్బుల పంపిణీ కార్యక్రమం మనకు కళ్లకు కనపడుతోంది. జగన్‌ తనతాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి నుంచి పంచి పెడుతున్నట్లుగా ఎపిలో బొక్కసం ఖాళీ చేస్తున్నారు.అధికారం పోతే ఊపిరి ఆగిపోయినంతగా ఫీలవుతున్నారు.

నిరంతరాయంగా తామే అధికారంలో కొనసాగేందుకు చేస్తున్న విన్యాసాలే నగగదు బదిలీ పథకాలుగా చెప్పాలి. దళిబంధు పేరుతో తెలంగాణలో చేసే విన్యాసం కూడా అలాంటిదే. అధికారంలోకి రావడానికి పథకాలు ప్రకటించడం.. అధికారంలోకి వచ్చాక దానిని నిలుపుకోవడానికి నగదు బదిలీ పథకాలు ప్రవేశ పెట్టడం ఈ పదేళ్లుగా బాగా అలవాటు చేసుకున్నారు. ప్రజలు చెమటోడ్చి పన్నులు కడితే అభివృద్ది పనులతో సంపదను సృష్టిం చాల్సిన నేతలు సంపదనలు హారతి కర్పూరంలా హరించి వేస్తున్నారు.

మోడీ తో సహా కెసిఆర్‌, జగన్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌ లాంటి సిఎంలంతా ఇందుకు  అతీతులు కాదు. ఏదో విధంగా అధికారాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో చేస్తున్న పథకాల కారణంగా ప్రజలు నష్టపోతున్నారు. విద్య,వైద్యం అంద కుండా పోతోంది. రవణా మార్గాలు నేటికీ అభివృద్ది జరగడం లేదు. ఏ రాష్ట్రంలోనూ పరిస్థితి భిన్నంగా ఏవిూ లేదు. ఆదాయం పెరగడంలేదు కానీ ఉచిత పథకాల భారం రోజురోజుకూ పెరుగు తోంది.

ఎన్నికలు వచ్చినపుడల్లా మరికొన్ని ఉచిత పథకాలు వచ్చి చేరుతున్నాయి. ఖర్చుల భారం పెరగ డంతో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేసేస్తున్నారు. అదేమంటే అభివృద్దికి అప్పులు తప్పవంటున్నారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న ఉచిత పథకాల వ్యాప్తిని చక్కదిద్దేందుకు సుప్రీంకోర్టు సంకల్పించిన నేపథ్యంలో ప్రజలు కూడా  దీనిపై చర్చించాలి. రాజకీయ పార్టీలను నిలదీయాలి. లేకుంటే వారు మనలను అప్పులకు బాధ్యలుగా చేయగల సమర్థులు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం కదలాలి. ప్రజలు, మేధావులు మేల్కోవాలి. లేకుంటే దేశం అప్పుల ఊబిలో కూరుకుని పోగలదు. రాజకీయ నాయకుల అధికారం కోసం మనం బలి కావద్దన్న చైతన్యం రావాలి.