తండ్రికి తలకొరివి పెట్టిన బిడ్డ
గతంలో తల్లిదండ్రులకు కుమారులు ఉండాలని అనుకునేవారు.. కానీ నేటి దైనందిక జీవితంలో కుమారు లతోపాటు కుమార్తెలు కూడా దేనికి తీసిపోరు అనే సంఘటన లో భాగంగా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన చెవిటి కొమురెల్లి 56 సంవత్సరాలు, గడిచిన కొన్ని రోజులుగా, అనారోగ్యానికి గురై బుధవారం మృతి చెందాడు. దీనితో అతనికి కుమారుడు లేని లోటును తన కుమార్తె ఉమ, ఏకంగా చేతిలో నీళ్లకు ఉండను పట్టి, తలకొరివి పెట్టడానికి, సిద్ధపడడం గమనార్హం. దీనితో ఈ సంఘటనను చూసి బంధువులు, కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఏదిఏమైనా సమాజంలో నేడు పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించడం పట్ల, తల్లిదండ్రులు, పురుషులు లేని బాధను మహిళలు చూసుకోవడం నిదర్శనంగా చెప్పవచ్చు.