ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర..కలెక్టర్

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర.

యువత ఇంటికే నేరుగా ఎపిక్ కార్డులు.

ఓటర్లను చైతన్య వంతులు చేయాలి.

యువతకు ఎపిక్ కార్డులు అందుచేత.

జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలక పాత్ర అని, దేశాభివృద్దికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన 12 వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్చగా వినియోగించుకోవాలని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరుగుతుందని 18 సంవత్సరాలు యువత ఓటరుగా తమ పేరును నమోదు చేయించుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు పంపుతామని, అందరు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాలలో ప్రదర్శిస్తారని, ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని లేనిచో వెంటనే ఓటర్ల జాబితాలో నమోదు చేయించుకోవాలని సూచించారు. కొందరు ఎన్నికల ఓటింగ్ రోజునే తమ పేరు లేదని ఆందోళనకు చెందుతారని, ముందుగానే సరిచూసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయుటకు నిర్ణయించిందని, దీని ద్వారా డూప్లికేట్ ఓటర్లకు అవకాశం ఉండదని తెలిపారు.

ఎన్నికల సంఘం ఈ.వి.యం. లలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు నోటా కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఓటర్ల నమోదు, ఓటర్లను చైతన్య వంతులను చేయుటలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కలవాలని అన్నారు.ఈ సందర్భంగా 01-01-2022 వరకు 18 సంవత్సరములు నిండి కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు డి.ఆర్.ఓ రాజేంద్రప్రసాద్ తో కలసి కలెక్టర్ ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డులను అందజేశారు.

ఈ సమావేశంలో ఏ. ఓ శ్రీదేవి, తహశీల్దార్ వెంకన్న, పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి, డి.టి. ఎలక్షన్స్ కళ్యాణ్ కుమార్, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.