చౌటుప్పల్ అంజిరెడ్డి థియేటర్ లో చెలరేగిన మంటలు
చౌటుప్పల్ అంజిరెడ్డి థియేటర్ లో చెలరేగిన మంటలు…..
-భయాందోళనకు గురైన ప్రేక్షకులు….
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం మున్సిపల్ కేంద్రంలోని అంజిరెడ్డి థియేటర్ లో 11 గంటల 30 నిమిషాలకు మొదటి షో ప్రారంభమైంది అయితే విరామసమయంలో పలువురు ప్రేక్షకులు సిగరెట్ తాగే దాన్ని ఆర్చకుండా పడేసారు. థియేటర్ యాజమాన్యం పాత కుర్చీలు అన్నిటిని పక్కన పడేసింది. అయితే అది గమనించని ఒక ప్రేక్షకుడు సిగరేటు ఆర్పకుండా అందులో పడ వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు దీనితో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు పెట్టారు.ఈ ప్రమాదంలో ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.