అధైర్య పడకు ..అండగా ఉంటా…మంత్రి జగదీశ్ రెడ్డి

మంచానికే పరిమిత మైన యువకుడిని చూసి చలించిన మంత్రి జగదీశ్ రెడ్డి
శస్త్ర చికిత్స ఖర్చు, వైద్య బాధ్యత ను తీసుకున్న మంత్రి
నిమ్స్ వైద్య సిబ్బంది తో మాట్లాడి స్పైనల్ కార్డ్ శస్త్ర చికిత్స కు ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన మంత్రి
నిమ్స్ లో యువకుడికి జరుగనున్న శస్త్ర చికిత్స
పెళ్లి చేసుకున్న సంతోషం మూణాళ్లు కూడా లేదు..ముచ్చట తీరకుండానే రోడ్డు ప్రమాదానికి గురై వెన్నుపూస తో పాటు రెండు కాళ్ళను కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు ఆ యువకుడు. ఎంతో భవిష్యత్తు ఉన్నా.. ఆర్థిక సమస్యలకు తోడు మానసిక సమస్యలుతో నా జీవితం ఇక ఇంతే అని తీవ్ర నిరాశ నిస్పృహ లలో మంచనికే పరిమితం అయిన యువకుడి జీవితంలోకి నేను ఉన్నానంటూ వచ్చాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి.. అధైర్య పడకు..అండగానేను ఉంటా అని మంత్రి ఇచ్చిన భరోసా మోడు వారిన యువకుడి జీవితంలో ఉత్సాహం నింపింది.
చర్చి కాంపౌండ్ కు చెందిన మొండి కత్తి వినీత్ వయసు 26 ఏళ్ళు .. చిన్న తనం లొనే తండ్రి ని కోల్పోయి కంప్యూటర్ ఆపరేటర్ గా పని చెస్తూ తల్లి ని చూసుకునే వాడు.. వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో కి అడుగుపెట్టి తల్లీ, భార్య, లను మంచిగా చూసుకోవాలని కన్న కలలు ఆది లొనే పటాపంచలు అయ్యాయి. వివాహం చేసుకున్న కొద్దీ రోజుల్లోనే విధి యాక్సిడెంట్ రూపం లో వక్రీకరించడం తో స్పైనల్ కార్డ్ దెబ్బతిని రెండు కాళ్ళు కోల్పోయి మంచానికే పరిమితం అయ్యాడు..భర్త పరిస్థితి ని చూసిన నవ వధువు తన దారి తాను చూసుకుంది.. దీంతో తీవ్ర నిరాశ నిస్పృహలతో ఖరీదైన వైద్యం చేపించు కోలేక మంచం పై నే జీవితాన్ని వెళ్లదీస్తున్న వినీత్ ను నిన్న పక్క ఇంట్లో కల్యాణ లక్ష్మీ చెక్ లను అందజేయడానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి గమనించారు.. స్థానిక నాయకుల ద్వారా మొత్తం విషయంలో తెలుసుకున్న మంత్రి, భవిష్యత్ ఉన్న యువకుడు మంచానికి పరిమితం అవడాన్ని చూసి చలించిపోయారు.. వెంటనే అక్కడికక్కడే నిమ్స్ వైద్యుల తో మాట్లాడి వెన్నుపూస ఆపరేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యానికి అయ్యే ఖర్చు లు కూడా తామే భరిస్తామని మంత్రి గారు ఇచ్చిన భరోసా యువకుడి నూతన ఉత్తేజం ,ఉత్సాహం ను నింపింది…అతి త్వరలో వినీత్ కు నిమ్స్ ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగనుంది.
వినీత్ పట్ల మంత్రి తీసుకున్న చొరవ ను ఆయా వార్డ్ ల ప్రజల తో పాటు పట్టణ వాసులు కొనియాడుతున్నారు..