గేటుకు లుంగీ ఇరుక్కుని దొంగ మృతి

హైదరాబాద్‌లో గేటుకు లుంగీ ఇరుక్కుపోవడంతో దొంగతనానికి వచ్చిన దొంగ మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి పైజామా గేటు దూకుతుండగా గొంతు నులిమి ఊపిరాడక మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే నగరంలోని బార్కాస్ జమలబండకు చెందిన హుస్సేన్ బిన్ అలీ జైదీ (52) మద్యానికి బానిసై దొంగతనాలు చేస్తున్నాడు.
శుక్రవారం రాత్రి సలాల పీలి దర్గా రోడ్డు సమీపంలోని పాత మోటార్ విడిభాగాల గోదాములో చోరీకి పాల్పడ్డాడు. ఈ క్రమంలో జైదీ పెద్ద గేటు పైకి ఎక్కి దూకుతుండగా లుంగీ గేటుకు తగిలి ఉదరం, ఛాతీకి చుట్టుకుని ఊపిరాడక చనిపోయాడు.
అయితే శనివారం మధ్యాహ్నం గోదాం సిబ్బంది అక్కడికి వెళ్లి చూడగా గేటు వద్ద వేలాడుతూ మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపారు.