భద్రకాళి ఆలయాన్ని తెరిచే ఉంచుతాం
వరంగల్: చారిత్రక భద్రకాళి ఆలయాన్ని తెరిచి ఉంచుతామని కార్యనిర్వహణాధికారి కె.శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఆలయాన్ని మూసివేస్తామన్న వార్తలను తోసిపుచ్చిన వారు, ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. కొంతమంది ఉద్యోగులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలిందని, వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని, అందువల్ల భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈఓ తెలిపారు. ఆలయంలో ఆచార వ్యవహారాలు యథావిధిగా కొనసాగుతాయని, భక్తులు కోవిడ్-19 ప్రోటోకాల్‌ను తప్పకుండా పాటించాలని ఈఓ విజ్ఞప్తి చేశారు.