Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పాండవుల గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి

పాండవుల గుట్ట – కోనరావుపేట జాజు గుట్ట వరకు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి …!

రామప్ప నుండీ పాండవులగుట్ట – కోనరావుపేట వరకు తారురోడ్డు వేయాలి…!

పర్యాటక ప్రాంతంలోని కోనరావుపేట అడవుల్లో జూ పార్క్ ఏర్పాటు చేయాలి …!

* ములుగు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలి* …! 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని పర్యాటక ప్రాంతమైన పాండవుల గుట్టలనుఅప్పటి వరంగల్ జిల్లా కలెక్టర్ శాలిని మిశ్రా 1996 లో పాండవుల గుట్టను సందర్శించి పర్యాటక ప్రాంతంగా (టూరిస్ట్) ప్రాంతంగా గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చి,కొంత మేరకు నిధులు కేటాయించారు.

ప్రాచీన కాలంలో బౌధ్ధ గుహలు బౌద్ధం ఇక్కడ పరిఢవిల్లిందాని ఇక్కడి గ్రామాల ప్రజలు, చరిత్రకారులు చెప్పుకుంటారు.బౌద్ధులు ధ్యాన కేంద్రాలైన పాండవుల గుహలు( గుట్టలు), రాతి గుట్టలు కట్టడాలు, కోనరావుపేటలోని అడవుల్లో ఉన్న జెండ గుట్ట, జాజుగుట్ట, రెండు గుట్టల సంద్దు,నల్ల గుండ్లు,నల్లబోల్లు,పోతరాజు చెలిమా వరకు నల్ల రాతిగుట్టల కట్టడాల వరకు బౌధ్ధ మత బిక్షువులు ఇక్కడ బౌద్ధం పరిఢవిల్లిందని చరిత్రకారులు, గ్రామాలా ప్రజలు,మేధావులు చెబుతారు.

బౌద్ధం తదనంతరం క్షత్రియులు అయిన పాండవులు ఇక్కడ అడవుల్లో వనవాసం చేశారని అందుకే వీరి పేరుమీదే పాండవుల గుట్టగా వచ్చిందని మరికొందరు ఇక్కడి గ్రామాల ప్రజలు అయిన కోనరావుపేట,తిరుమలగిరి, వెంకటేశ్వర్లపల్లి, జూబ్లీ నగర్,ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సాపురం గ్రామాల ప్రజలు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధుల కాలం బౌధ్ధ మతం ఆరంభ దశ నుండి ఇక్కడే విశేష ఆదరణ పొందింది. అష్టాంగ మార్గంలో, ధమ్మ,ప్రజ్ఞ,కరుణ, సమత ప్రజలకు బోధించే వారని,మానవులకు కోరికల వల్ల దుఃఖం కలుగుతుంది అని బోధనలు చేసేవారని చెప్తున్నారు.

అశోకుని కాలంలో 263 బి సి నుండి బౌద్ధాన్ని ఇక్కడ ఆచరించే వారు. బుద్ధుడే స్వయంగా 5 – 6 వ శతాబ్దంలో ఇక్కడ సందర్శించాడు..అని ఇక్కడ ప్రజల అభిప్రాయం ఉంది..బౌధ్ధ బిక్షువులు ఇక్కడ ధ్యాన కేంద్రంగా ఉండేవారని, కోనరావుపేట అడవుల్లో బౌధ్ధ సంఘంలోని జ్ఞానోదయం పొందిన ధర్మ మార్గాన్ని ఆచరించే వారని ఇక్కడే అడవుల్లో నివసించే వారని ఇక్కడి గ్రామాల ప్రజలు చెబుతున్నారు. హిందు మతం ప్రారంభం అయ్యాక బౌద్ధమతం అంతరించి పోయిందన్ని ఇక్కడి బౌద్ధులు చనిపోయారని, కొందరు వెళ్లిపోయారని చెపుతున్నారు.

తదనంతరంహిందూ మతం ప్రారంభం అయింది అని తర్వాత పాండవులు వనవాసం కోసం ఇక్కడి కి వచ్చారని చెబుతున్నారు.చరిత్ర పూర్వ రాక్ పెయింటింగ్ లు అనంతమైన మరియు భావి తరాల కోసం చెక్కబడిన పేర్లు మానవ విజ్ఞాన పరిణామాన్ని గుర్తించే పాండవుల గుట్టల్లో సహస్రాబ్దాల నాటి రాతి చిత్రాలు.పాండవుల గుట్ట 10000 బి సి – 8000 బి సి నాటి రాక్ షెల్టర్ లకు నిలయై ఇది 8 వ శతాబ్దపు శాసనం మరియు 12 వ శతాబ్దపు కాకతీయ సామ్రాజ్యం నుండి చిత్రించిన ప్రెస్కొలు.సహజ రంగులో ఉంటాయి.

పూర్వ చారిత్రక రాతి చిత్రాలు అయిన వృక్షజాలం,జంతుజాలం మరియు మానవ బొమ్మలు ఎరుపు రంగులో ఉంటు.కాకతీయ కళాకారులు మహాభారతం మరియు ఏనుగుతల దృశ్యాలను చిత్రించిన నిలువెత్తు నిదర్శనంగా. ప్రకృతి అందాలు, కమనీయమైన సహజసిద్ధమైన వాతావరణం, లో శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి, గుట్ట పైన గరుడ దీపం, ప్రతి సవంత్సరం కార్తీక పౌర్ణమి లో ఇక్కడ బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర ఘనంగా జరుగుతుంది.

దైవదర్శనానికి జయశంకర్ (భూపాలపల్లి) జిల్లాతో పాటు ములుగు, హన్మకొండ, వరంగల్, భక్తులు, పర్యాటకులు, అధిక సంఖ్యలో వస్తుంటారు.ప్రతి ఏడాది మే చివర్లో వారములో లేదా జూన్ మొదటి వారల్లో వర్షాల పడని యెడల,వర్షాలు కురువాలని ఇక్కడి చుట్టూ ప్రక్కల గ్రామాలైన తిరుమలగిరి,జగ్గయ్యపేట, కోనరావుపేట, గోరి కొత్తపల్లి, నిజాంపల్లి, వెంకటేశ్వర్లపల్లి, జూబ్లీ నగర్, రామన్న గూడెం ప్రజలు, రైతులు, మహిళలు యువకులు కప్ప తల్లి ఆట తొ పసుపు కుంకుమ కలిపి కట్టెకు కట్టి తెల్లని వస్త్రానికి పూసి గ్రామాల్లో పాటలు పాడుతూ ఇంటింటికీ తిరుగుతు, ఒకరి మీద ఒకరు నీళ్ళు పోసుకోవడం ఇక్కడి గ్రామాల ప్రత్యేకత.మొక్కులు చెల్లించడానికి పాండవుల గుట్టకు వెళ్ళడం ఇక్కడి ప్రజల విశ్వాసం.

అంతే కాకుండా ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆదివాసి కుంభమేళా అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు భారీగా భక్తులు తరలి వస్తారు. తిరుగు ప్రయాణంలో పాండవుల గుట్టలను సందర్శించి ఇక్కడే విడిది చేస్తారు.అబ్బురపరిచే ప్రకృతి రమణీయమైన పచ్చని అడవులు,పాండవుల గుట్టలు పై మీద ఎక్కి చూస్తే భూపాలపల్లి,ములుగు, పరకాల, రామప్ప సరస్సు, ఘనపురం సరస్సు, కోనరావుపేట యాసిన్ సాగర్ చెరువు, చుట్టూ పక్కల గ్రామాలు అంధలను, పర్యాటకులకు కనువిందు చేస్తాన్నాయి. అప్పటి 2014 లో వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి రాక్ క్లైమ్బింగ్ పాండవుల గుట్ట ను ఎక్కి చరిత్ర సృష్టించారు..

అప్పటినుండి పర్యాటకుల నిత్యం రాకపోకలు జరుగుతూ ఉంటుందని వీటి సౌకర్యార్థంగా భూపాలపల్లి,ములుగు, పరకాల,వరంగల్, హన్మకొండ,నర్సంపేట,మహబూబాబాద్,హైదరాబాద్, ప్రాంతాల నుండి పర్యాటకులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.ఆర్టీసీ బస్సులను పాండవుల గుట్ట ద్వారా నడిపించే విధంగా పర్యాటక ప్రాంత చేరువలో ఉంది.కోనరావుపేట అడవుల్లో జూపార్క్ ఏర్పాటు చేసినట్లయితే వన్యప్రాణులు అంతరించి పోకుండా ఉండేందుకు ఇక్కడే జూపార్క్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇక్కడ మట్టి రోడ్డులో ఉండడం వలన ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మట్టి రోడ్లను తారు రోడ్లు గా మార్చాలని అలాగే ములుగు జిల్లా లోని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం గుర్తింపు పొందిన కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ రామప్ప దేవాలయం – కోనరావుపేట క్రాస్ (వయా నర్సాపురం,పాండవుల గుట్ట, వెంకటేశ్వర్లపల్లి) వరకు బాహ్య వలయంగా రోడ్డు నిర్మాణం చేపడితే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందాన్నారు. అదేవిధంగా ఇక్కడి యువతకి ఉపాధి అవకాశాలు లభించే విధంగా మెండుగా ఉన్నాయని.ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి,సీతక్క ప్రత్యేకంగా చొరవ చూపి నిధులు కేటాయించాలని ఈ ప్రాంత ప్రజలు పర్యాటకులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు…

జిల్లా కలెక్టర్లు ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని పాండవుల గుట్టను ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణ రెడ్డి, సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని శాసనసభ సమావేశాలలో ఈ విషయం పైన చర్చించాలి. *రామప్ప నుండి పాండవులగుట్ట – కోనరావుపేట వరకు రింగ్ రోడ్డు వేయాలి..
కళ ప్రసిద్ధిగాంచిన రామప్ప ఆలయం నుండి పాండవులగుట్ట – కోనరావుపేట వరకు తారు రోడ్డు వేయడం వల్ల పర్యాటకుల సంఖ్య అధికమై పర్యటించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బౌద్ధులు ధ్యాన కేంద్రం గా ఈ పాండవులగుట్ట అప్పటి బౌద్ధులు ఈ పాండవుల గుట్ట నుండి కోనరావుపేట జాజు గుట్ట అడవుల్లో బౌద్ధులు ధ్యానం చేసుకొని ఇక్కడే బౌధ్ధ సంఘాలు నివాసం ఏర్పర్చుకున్నారు.ఈ ప్రాంతంలో బౌద్ధ ధ్యాన కేంద్రాలు గా నిర్వహించే వారు. బౌధ్ధ బిక్షువులు ఇక్కడి ప్రజలు దళితులు,బీసీ లు కొన్ని సంవత్సారాలు బౌద్ధాన్ని స్వీకరించి ఆచరించారని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు చెపుతున్నారు.