తోడ పుట్టిన తమ్ముడే కాలయముడయ్యాడా..?
*తోడ పుట్టిన తమ్ముడే కాలయముడయ్యాడా..?
ప్రముఖ పోటో గ్రాఫర్ బండ అమృత్ రెడ్డిని తన తోడ పుట్టిన తమ్ముడు బండ పురుషోత్తం రెడ్డి ,అమృత్ రెడ్డిపై దాడి చేసి చంపినట్లుగా తెలుస్తుంది.
బండ అమృత్ రెడ్డి కొన్న బూమిలో తనకు వాటా కావాలని గత కొంత కాలంగా బెదిరిస్తూ వస్తున్న బండ పురుషోత్తంరెడ్డి,పతకం ప్రకారమే కొట్టి చంపాడని.ఈ
విషయం బయటికి చెప్పొద్దని కుటుంబ సభ్యులను బెదిరించడంతో వారు బయపడి చెప్పలేదన్నది సమాచారం
తన అన్న బండ అమృత్ రెడ్డిని తానొక్కిడినే చంపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం.
ముషంపల్లిలో అమృత్ రెడ్డిపై దాడిచేసిన పురుషోత్తంరెడ్డి, కొన ఊపిరితో ఉన్న అమృత్ రెడ్డిని నల్లగొండలోని ప్రవేట్ హాస్పటల్ కి తీసుకెళ్ళగా ,ఆ హాస్పటల్ వారు తీవ్రంగా దెబ్బలున్నాయి,90% బతకటం కష్టం,హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పడంతో అమృత్ రెడ్డిని హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ కి తీసుకెళ్ళారు.
అక్కడ డాక్టర్స్ కూడా గట్టి గాయాలు కావడంతో ,బాడి లోపల బాగా బ్లీడింగ్ అయ్యింది,ఆపరేషన్ చేసినా బతికే చాన్స్ లేవు అని చెప్పడంతో తిరిగి నల్లగొండ తీసుకొని వచ్చిన తర్వాత చనిపోయాడని కుటుంబ సబ్యులకు చెప్పిన పురుషోత్తంరెడ్డి, తాగి కింద పడిపోయినట్లు, తలకు దెబ్బ తాకటంతో చనిపోయినట్లు నమ్మించట్లుగా తెలుస్తోంది.
నిందితుడు బండ పురుషోత్తంరెడ్డిని ఈ రోజు కోర్టుకు హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.