తెలుగు రాకున్న జానపదాలు,భక్తిగీతాలు పాడుతున్న సాన్విక
తెలుగు రాకున్న తన తెలివితేటలతో
ఎదుటివారి పాటలు విని…
-జానపదాలు ,భక్తిగీతాలు పాడుతున్న
చిన్నారి ” సాన్విక ”
తెలుగు అక్షరాలు అంటే ఆమెకు తెలియవు……
కానీ తెలుగులో ఎదుటీవారు పాడే జానపద , భక్తిగీతాలు విని స్వచ్ఛమైన ఉచ్చారణతో వినసొంపుగా అద్భుతంగా ఆమే పాడుతుంది,……
ఆమే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో ఇంగ్లీష్ మీడియం లో మొదటి తరగతి చదువుతుంది.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శ్రీరామోజు అంజలి శేఖర్ దంపతులకు 6 సంవత్సరాల వయస్సున్న పెద్ద కూతురు.
శ్రీ రామోజూ సాన్విక సరదాగా టిక్ టాక్ ధ్వారా ఆద్బుతంగా డాన్స్ చేస్తుంది. ఇటీవల జరిగిన అయ్యప్ప పడిపూజ లో ఆమె అయ్యప్పా పై భక్తి పాటలు పడగా కేరళ అయ్యప్పా టెంపుల్ లోని పూజారి ఉన్ని కృష్ణన్ ఆమేను అబినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భక్తి భావంతో భక్తి గీతాలు జానపద గీతాలు పాడే ఇలాంటి పిల్లలను కని పెంచిన తల్లిదండ్రులకు ముందుగా నమస్కారం చేయాలన్నారు.తెలంగాణ ఏ వన్ టివి ఛానల్ వారు నిర్వహిస్తున్న అందరి టీవీ పాటల పల్లకి అనే కార్యక్రమంలో ఆన్లైన్ సింగర్ కాంటెస్ట్ పోటీలు నిర్వహించగా సాన్విక అయ్యప్పా భక్తి గీతాన్ని మూడు నిమిషాల పాటు ఎంతో అద్భుతంగా పాడి పలువురుని అలరించి ఇందులో టాప్ మోస్ట్ ర్యాంకు సాధించి పలువురి ప్రశంసలు అందుకుంది. తెలుగు అక్షరం రాకున్నా తన తెలివితేటలతో తెలంగాణ లో తన గానామృతాన్ని వినిపించిన గాణకోకిల సాన్విక పాడిన పాట సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది.ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ దాగి ఉంటుంది.పేరెంట్స్ తమ పిల్లల లోని ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తూ మంచి శిక్షణ ఇప్పిస్తే తమకు ఇష్టమైన రంగంలో పిల్లలు చక్కగా రాణిస్తారు.