కుల వృత్తి ని మించిన వృత్తి లేదు.. గువ్వలచెన్న

30 సంవత్సరాలుగా ఓకే వృత్తిలో రాణిస్తున్న ఉపేంద్ర!

కుల వృత్తి ని మించిన వృత్తి లేదు గువ్వలచెన్న.

కుల వృత్తిని మించిన వృత్తి లేదు గువ్వలచెన్నా… నాథుడి మాట నుండి వెలిగిన నిజమైన పలుకు లాగా..30 సంవత్సరాలుగా ఓకే వృత్తిని చేస్తూ… జీవనం సాగిస్తున్న మరి పెద్ది ఉపేంద్ర రాములు విజయ గాధ.

మండల పరిధిలోని వెలుగు పల్లి గ్రామంలో, బతుకు తెరువు కోసం గొట్టిపర్తి నుండి వెలుగు పెళ్లికి వచ్చి, సుమారు 30 సంవత్సరాలుగా గ్రామంలోని ప్రజలందరికీ కులవృత్తి అయిన బట్టలను ఇస్త్రీ చేస్తూ, జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. భర్త రాములు టెంట్ హౌస్ ను నిర్వర్తిస్తుండగా, తను మొక్కవోని ధైర్యంతో, గ్రామంలోకి వెళ్లి , బట్టలు తీసుకొని వచ్చి, ప్రతిరోజు ఇస్త్రీ చేస్తూ సుమారుగా 300 నుండి 500 రూపాయలు సంపాదిస్తు గ్రామంలో సొంత ఇంటిని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపింది,. ఏది. ఏమైనా కులవృత్తులు అంతరించిపోతున్న తరుణంలో, ఆమె మాత్రం 30 సంవత్సరాలుగా ఒకే వృత్తిని నమ్ము కుంటూ కొనసాగిస్తూ ఉండడం, నేటి యుగంలో చెప్పుకోదగ్గ విషయమే.