చెక్ డ్యామ్ కట్టి ఏడాది కాలే …అప్పుడే పగుళ్లు

నాసిరకంగా చెక్ డ్యామ్ నిర్మాణం.
– కట్టి ఏడాది కాకమునుపే పగుళ్లు.
– లక్షల రూపాయలు దండుకున్న కాంట్రాక్టర్ల నిర్వాకం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల కేంద్రంలో మాదారం మంగపేటబ్రిడ్జి రైట్ సైడ్ చెక్ డ్యామ్ కట్టడం జరిగి ఎనిమిది తొమ్మిది నెలలు కావస్తోంది. అక్కడ ఉన్నటువంటి రైతులు సంతోషం వ్యక్తం చేసి, అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు ఈ వేసవి కాలం పంటకు చాలా సంతోషం తో త్రీఫేస్ మోటర్లు ఆయిల్ ఇంజన్లు ఆ చెక్ డ్యామ్ ప్రదేశంలో తెచ్చిపెట్టి ఎంతో సంతోషంతో త్రీ ఫేస్ మోటర్లు ఆయిల్ ఇంజన్ తో అక్కడ ఉన్నటువంటి నీళ్లను తోడి ఈ వేసవి కాలం పంట పొలాలకి తీసుకు వెళ్లే లోపు రైతుల ఆశలన్నీ అడియాసలయ్యాయి అవిరైపోయాయి. అని గత వర్షాకాలం టైం లో వర్షాలు బాగా కురవడం వలన ఫ్లోటింగ్ ఎక్కువై ఆ చెక్ డ్యామ్ అడ్డంగా క్రాక్ వచ్చి పగిలిపోయి, ఆ చెక్ డ్యామ్ లో నీళ్ళు మొత్తం కారిపోవడం జరుగుతున్నది. అని అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు చెబుతున్న మాటలు ఏమిటంటే ములకలపల్లి మండలం ప్రజలు ఇంటి పన్ను, వాటర్ పన్ను, కరెంట్ బిల్లులు, వగైరా వగైరా అన్ని పన్ను లు నుండి ములకలపల్లి మండలం పంచాయతీలు ఏరియాలో నుండి పన్నువసూలు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం లక్షలు లక్షలు పెట్టి కాంట్రాక్టర్లకు పనులు ఇస్తే
ఆ కాంట్రాక్టర్లు లాభాలు గడించడం కోసం నాసిరకమైన పనులు చేసి చెక్ డ్యామ్ లో ఎన్నో అవకతవకలు జరిగి ఉంటాయని, ఆ చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు.
రైతులు చెప్తున్న మాట, ఈసారి వర్షాకాలం టైంలో వర్షాలు బాగా పడితే వరద ఫ్లోట్టింగ్ ఎక్కువైతే ఖచ్చితంగా ! చెక్ డ్యామ్ పగిలిపోతుంది. అని ఈ చెక్ డ్యామ్ మంచిగా గనుక ఉంటే మాకు వర్షాకాలం వేసవి కాలం పంటలు మంచిగా పండించే వాళ్ళము అని కోరుకుంటున్నారు. సిరి సంపదలు వచ్చి ఉండేటి అని వాపోతున్నారు. ఇకనైనా త్వరగా కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు వర్షాకాలం రాక ముందే దాన్ని మరమ్మతులు చేస్తే బాగుంటుంది. అని కూడా అడుగుతున్నారు. ఇకనైనా స్పందిస్తారని చెక్ డ్యామ్ చుట్టుపక్కల పంట పొలాల రైతులు ఎదురుచూస్తున్నారు.