దోచుకున్నోడికి దోచుకున్నంత

-పుచ్చ రైతన్నల కస్టార్దం దళారుల పాలు..
చర్ల జనవరి 20 (నిజం న్యూస్) మండలంలోని గొమ్ముగూడెం గోదావరి తీర ఇసుక నేలపై రైతన్నలు పుచ్చ సాగు సేద్యం కొరకువ్యాపారుల దగ్గర నుండిపుచ్చ విత్తనాలు కొంత పెట్టుబడి తెచ్చి రైతులు పుచ్చ సాగు చేస్తున్నారు ప్రతి ఏడాది ఇతర ప్రాంతాలనుండి పుచ్చ కాయలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎక్కడకు వస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది దళారులు వ్యాపారులతో కుమ్మక్కై ఒక టన్ను ధర రూ 8 నుండి 9 వేల వరకు ధరవుండగా రైతుల వద్ద నుండి మాత్రం ముందు విత్తనాలు కొంత డబ్బు పెట్టుబడులు పెట్టి పుచ్చ రైతన్నలనునిలువెళ్ళ దోసుకుంటున్నారు కొనుగోళ్ల బొంబాయి కర్ణాటక కేరళ తమిళనాడు ప్రాంతాలనుండి దళారులు వ్యాపారుల మద్య కమిషన్ మాట్లాడుకొని పుచ్చకాయల వ్యాపారం చేస్తూ రైతు కంటే దళారులు లాభాలు పొందుతున్నారు రోజు రైతుల వద్ద నుండి 3నుంచి 5.లారీలు పుచ్చకాయలు రవాణా చేస్తున్నారు గురువారం పుచ్చకాయ వ్యాపారులు కొనుగోలు లారీలు క్యూ కట్టాయి దీని ని బట్టి చూస్తే పుచ్చకాయ కు ఎంత గిరాకీ ఉందో అర్థమవుతోంది ఏది ఏమైనా వ్యాపారులు దళారులు కుమ్మక్కై ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి