ప్రారంభమైన లక్ష్మీతిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం

ప్రారంభమైన అమ్మవారి రంగుల మహోత్సవం

జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు గోపయ్య సమేత లక్ష్మీతిరుపతమ్మ అమ్మవార్ల రంగుల మహోత్సవం ఘనంగా ప్రారంభమైనది. ఈ సందర్భంగా జగ్గయ్యపేట పట్టణానికి విచ్చేయుచున్న శ్రీ గోపయ్య లక్ష్మీతిరుపతమ్మ అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసనసభ సభ్యులు శ్సామినేని ఉదయభాను పెనుగంచిప్రోలు వెళ్లి దర్శించుకొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సర్పంచ్ వేల్పుల పద్మ కుమారి, ఎంపీపీ మార్కపూడి గాంధీ, వేల్పుల రవి, కాకాని హరి, ఆకుల నాని బాజి, గూడపాటి శ్రీను, పిడికిడి కోటేశ్వరరావు, ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.