తమిళనాడులో సబ్‌ఇన్‌స్పెక్టర్లు,హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
నామక్కల్ జిల్లాలో ఒక వికలాంగ వ్యక్తి కస్టడీలో మరణించారని ఆరోపనలు ఎదుర్కొంటున్న కేసును తదుపరి విచారణ కోసం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ CB-CIDకి బదిలీ చేశారు.
కిరాణా వ్యాపారి ఇంట్లో నగలు చోరీకి పాల్పడిన కేసులో ప్రభాకరన్, వికలాంగుడైన వ్యక్తి మరియు అతని భార్య హంసను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభాకరన్‌ను నమక్కల్‌లోని సబ్ జైలులో, అతని భార్య హంసను సేలం సెంట్రల్ జైలులో ఉంచారు.
జనవరి 12న అస్వస్థతకు గురికావడంతో ప్రభాకరన్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందాడు.
ప్రభాకరన్ మరణం తరువాత, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రభాకరన్‌ను అరెస్టు చేసిన పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అతని కుటుంబ సభ్యులు మరియు విడుతలై చిరుతైగల్ కట్చి (VCK) పార్టీ సభ్యులు నిరసనకు దిగారు.
కస్టడీలో చిత్రహింసల కారణంగానే ప్రభాకరన్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ప్రభాకరన్ మృతికి సంబంధించి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సేలం రేంజ్ డీఐజీ (ఇన్‌చార్జి) ఆదేశాలు జారీ చేశారు.