కొత్తగూడెం ఆర్డీఓ, పాల్వంచ నాయబ్ తహశీల్దార్లకు నోటీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డివిజన్ ఆర్డీఓ మరియు పాల్వంచ రెవెన్యూ కార్యాలయంలోని నాయబ్ తహశీల్దార్ లకు లీగల్ నోటీసులు వచ్చిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ……
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బోడు గ్రామానికి చెందిన గంగాధర కిశోర్ కుమార్ 2020 ఆగస్టులో పాల్వంచ రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న 444, 817, 999 సర్వేనంబర్లు, ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్, పట్టాదారు పాసుపుస్తకాల జాబితా వివరాలకొరకు సమాచార హక్కు చట్టం క్రింద ధరఖాస్తు చేసాడు. అయితే పాల్వంచ నాయబ్ తహశీల్దార్ ఈ ధరఖాస్తుకి సమాధానం ఇవ్వలేదు. ధరఖాస్తుదారుడు కొత్తగూడెం ఆర్డీఓ కి మొదటి అప్పీలు చేయగా మూడుసార్లు హియరింగ్ నిర్వహించినా పాల్వంచ నాయబ్ తహశీల్దార్ హాజరుకాలేదు. కొత్తగూడెం ఆర్డీఓ సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా పాల్వంచ నాయబ్ తహశీల్దార్ ధరఖాస్తుదారుడు అడిగిన సమాచారం కాకుండా వేరే సమాచారం ఇవ్వడంతో పాటూ అలా ఇచ్చిన సమాచారాన్ని కూడా తప్పుదారి పట్టించేదిగా ఇచ్చాడు. నేను అడిగిన సమాచారం ఇదికాదు అని ధరఖాస్తుదారుడు చెప్పినా నాయబ్ తహశీల్దార్ పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కు చెందిన హైకోర్టు లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించాడు. అంతేకాకుండా పాల్వంచ రెవెన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూములకు జారీచేసిన ఎన్ఓసి సర్టిఫికెట్లకు సంబంధించి సమాచారం ఇవ్వనందుకు కూడా లీగల్ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. ధరఖాస్తుదారుడు అడిగిన సర్వే నంబర్లు అన్ని ప్రభుత్వ భూమూలకు సంబంధించినవి కావడంతో పాటూ ఆ భూముల్లో జిల్లాలోని ప్రముఖు రాజకీయ పెద్దలు వారి అనుచరులు కూడా ఆక్రమణలు జరిపుతుండడం వలన ఈ విషయం పాల్వంచ లో చర్చానీయాంశం అయింది.