నాలుగు ముక్కలైన తలను అతికించిన అరుదైన ఆపరేషన్
సూర్యాపేటలోని హెల్దీఫై హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్.. 4 ముక్కలైన తలను అతికించిన సూర్యాపేటలోని హెల్దీఫై హాస్పిటల్ వైద్య బృందం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రముఖ హాస్పిటల్ హల్దీఫై మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వైద్య బృందం గత ఆదివారం అరుదైన ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. హెల్దీఫై హాస్పిటల్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక చర్చి కాంపుండ్ ప్రాంతానికి చెందిన ఫార్మాసిస్ట్ చల్లమల్ల రమేష్ బాబు(42) ఈ నెల 16 వ తేదీ ఆదివారం అర్ధరాత్రి చర్చి కాంపౌండ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బైక్ స్కిడ్ అయి కింద పడగా తల 4 ముక్కలై విపరీతంగా రక్తస్రావం అవుతుండగా తక్షణమే జమ్మిగడ్డలోని హెల్దీఫై హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆ అర్ధరాత్రి సమయంలో కూడా హాస్పిటల్ లోనే అందుబాటులో వున్న డాక్టర్ల బృందం పేషంట్ ను అడ్మిట్ చేసుకొని వెంటనే అవసరమున్న వైద్యపరీక్షలు చేయించి అదే అర్ధరాత్రి శస్త్ర చికిత్స చేసి విజయవంతంగా తలను యధావిధిగా వుండేటట్టు 70 కుట్లు వేసి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన హెల్దీఫై హాస్పుటల్ బృందం.
ఈ అరుదైన ఆపరేషన్ చేసిన హెల్దీఫై హస్పిటల్ ను సందర్శించి పేషెంట్ ను పరామర్శించి హెల్దీఫై హాస్పిటల్ వైద్య బృందాన్ని, మేనేజ్ మెంట్ ను అభిందించిన సూర్యాపేట జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ.
అపస్మారక స్థితిలో హాస్పిటల్ లో చేరి చికిత్స అనంతరం మీడియా తో చల్లమల్ల రమేష్ బాబు మాట్లాడుతూ తన ప్రాణాలను కాపాడిన హెల్దీఫై హాస్పిటల్ డాక్టర్లకు, యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ కార్పోరేట్ వైద్యాన్ని సూర్యాపేట హల్దీఫై హాస్పిటల్ లోనే అందించడం చాలా గొప్ప విషయమని బతకడు అనుకున్న రమేష్ ను బతికించిన హెల్దీఫై హాస్పిటల్ ను అభినందిస్తున్న పేషెంట్ బంధువులు. ఈ సందర్భంగా హెల్దీఫై హాస్పిటల్ అధినేత మతకాల చలపతి రావు మాట్లాడుతూ కార్పోరేట్ వైద్యమంటూ హైదరాబాద్ వెళ్ళి లక్షలకు లక్షల డబ్బులను వృధాగా ఖర్చు చేసుకోవద్దంటున్నారు. తక్కువ ఖర్చు తో కార్పోరేట్ వైద్యాన్ని మన సూర్యాపేట జమ్మిగడ్డలోని హెల్దీఫై హాస్పిటల్ లోనే అందిస్తున్నామని చెప్పారు. 24 గంటలు అర్ధరాత్రి కూడా డాక్టర్లు హస్పిటల్ లోనే అందుబాటులో వుంటారన్నారు.