ధర్మారం గ్రామంలో ఆదిమానవుల అవశేషాలు

*ధర్మారం గ్రామంలో ఆదిమానవుల అవశేషాలు*
కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోఅటవీ పరిధిలోగల మైసమ్మ గుట్ట లో ఆదిమానవులు సంచరించినట్లు గుర్తులు ఉన్నాయి అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా ఆదిమానవుల సంబంధించిన సమాధులు కూడా ఉన్నాయి వీటిని ప్రభుత్వం గుర్తించి మైసమ్మ గుట్ట ప్రాంతంలో మైసమ్మ దేవత ను ధర్మారం గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది ఈ క్రమంలో సర్పంచ్ అరుణ లక్ష్మణ్ మాట్లాడుతూ ధర్మారం అటవీ పరిధిలో అత్యంత పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు మైసమ్మ గుడి గా పిలువబడే ఆదిమానవులు సంచరించినవి ఉన్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి అట్టి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసి రహదారి నిర్మాణం చేపడితే పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుంది అని ఆదిమానవుల ఈ విషయం ప్రజలకు తెలుస్తుందని వారు అన్నారు