కరీంనగర్ మున్సిపాలిటీలో ఏసీబీకి పట్టుబడ్డ ఇంజ‌నీర్ రామన్

*కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో ఎసిబి దాడులు

*17వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ రామన్*

కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ లో ఎసిబి అధికారుల దాడులు కలకలం రేపాయి. అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో లంచగొండి అధికారి చిక్కాడు. మంగళవారం ఎసిబి డిఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ మధు అనే ఓ కాంట్రాక్టర్ నుండి రూ.17 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంజనీర్ రామన్ ఇండ్లలో సైతం ఎసిబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కెమికల్ టెస్టులు నిర్వహించి బాధితులు నిందితుడి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు.