అత్యాచార యత్నానికి ప్రయత్నించిన సర్పంచ్ భర్త పై ఎస్పీకి ఫిర్యాదు

సూర్యాపేట జిల్లా వర్ధమాన కోట గ్రామ సర్పంచ్ భర్త బోయిని లింగమల్లు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడని మంగళవారం ఎస్పీకి ఫిర్యాదు చేసిన దంపతులు.
బోయిని లింగామల్లు గత కొంత కాలం గా సూటిపోటి మాటలతో తనపై లైంగిక వేధింపుల కు గురి చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన మామిడి వీరేష్ సతీమణి ఉమ దంపతులు ఆరోపించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దంపతులు మాట్లాడుతూ.
మాట్లాడుతూ నా భర్త ఇంట్లో లేని సమయంలో బైక్ పై సోమవారం తన గృహంలో కి వచ్చి తనపై అత్యాచార యత్నానికి పాల్పడేందుకు ప్రయత్నించాడని తన భర్త కు ఫోన్ చేయడం తో ఆ సమయంలో భర్త రావడంతో బైక్ వదిలి పారిపోయాడని బాధితురాలు వాపోయింది. వెంటనే 100కు డయల్ చేయడం తో పోలీసులు వచ్ఛి విచారణ చేసి వాంగ్మూలాన్ని సేకరించారని దంపతులు అన్నారు .సర్పంచ్ భర్త అయిన లింగమల్లు పై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ కు మంగళవారం ఫిర్యాదు చేసినట్టు దంపతులు తెలిపారు