చింతామణి నాటకం నిషేధం పై ఆర్య వైశ్య సంఘం హర్షం
చింతామణి నాటకం పట్ల ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం… జగ్గయ్యపేట ఆర్య వైశ్య సంఘం
ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీస్తున్న టువంటి చింతామణి నాటకం పట్ల, సుబ్బిశెట్టి వేషధారణతో ఆర్యవైశ్యుల మనోభావాలను కించపరచడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ధర్మాదాయ దేవాదాయ శాఖామాత్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు సామినేని ఉదయభాను ఆశీస్సులతో ఆర్యవైశ్యలపై అనాధి గా వస్తున్న అవమానాలకు అడ్డుకట్ట వేశారని, నాటకాల పేరుతో కోమట్ల కులానికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపివేశారని, ఇది నిజంగా హర్షించదగ్గ విషయమని నూకల సాంబశివరావు అన్నారు. చింతామణి నాటకాన్ని ప్రభుత్వం నిషేదిస్తూ తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణములో ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు మాజీ గవర్నర్ ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ దివంగత కొణిజేటి రోశయ్య విగ్రహమునకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శెట్టి పేరుతో చింతామణి నాటకంలో వైశ్య కుటుంబానికి జరుగుతున్న అవహేళనను నిషేదించారన్నారు. ఆంధ్ర ఆర్యవైశ్యుల మనోభావాలను అర్ధం చేసుకొని చింతామణి నాటకాన్ని నిషేదించిన ముఖ్యమంత్రి వర్యలు వై యస్ జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చింతామణి నాటకాన్ని నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేయడం పట్ల. భారతదేశములో ఉన్న ఆర్యవైశ్యులు అందరూ వీరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్య పేట పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు చోడవరపు జగదీష్, శివాలయం చైర్మన్ గెల్లా పూర్ణచందర్రావు, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ, కొండ, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు చిన్నం సీతా రామ కృష్ణ ప్రసాద్, వాసవి క్లబ్ నందనవనం అధ్యక్షులు యన్నకుల
మణికంఠ, యన్నకుల రాంబాబు, వల్లా విస్సు వెన్న ప్రశాంత్, నాగళ్ళ సందీప్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.