సార్ ఆదుకోండి ప్లీజ్ … కుటుంబ సభ్యులు వేడుకోలు!

దళిత పేద కుటుంబం, కేవలం కేసీఆర్ పింఛన్, భార్య అనారోగ్యంతో నడవలేని స్థితిలో, దిగులు పడుతున్న తరుణంలో ఒక్కసారిగా ప్రకృతి వైపరీత్యానికి, ఉన్నటువంటి చిన్న రేకుల ఇల్లు కూలిపోయి, దీన స్థితికి చేరుకున్న కుటుంబ కష్టాలు మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లో చోటు చేసుకుంది.

 

గొట్టిపర్తి గ్రామానికి చెందిన సోమయ్య, దంపతులు చిన్న రేకుల ఇంటిలో నివాసముంటున్నారు. గత రెండు రోజులుగా వీచిన గాలి, వర్షానికి ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. కేవలం నెలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పింఛన్ తో జీవితం నడుస్తున్నది.

 

భార్యకు గత కొంత కాలంగా అనారోగ్యానికి గురికావడంతో, ఆమెకు సపర్యలు కూడా, సోమయ్య మీదనే పడ్డది. కుటుంబాన్ని కష్టాలు పడుతూ, నెట్టుకొస్తున్న తరుణంలో గాలి కి వర్షం తోడై ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నది. దీనితో గ్రామానికి చెందిన ఎంపీటీసీ కేతి రెడ్డి ,లతా విజయ్ కుమార్ రెడ్డి కలిసి వెళ్లి బాధిత కుటుంబానికి రెండు వేల రూపాయలు, తక్షణ సహాయంగా అందించారు. ఏది ఏమైనా ప్రస్తుతం కూలిపోయిన ఇల్లు నిర్మించాలంటే, కనీసం 80 వేల రూపాయలు వెచ్చించాల్సి ఉన్నది.

 

తుంగతుర్తి నియోజకవర్గంలో నిరుపేదలు ఆపదలో ఉన్నప్పుడు, మానవతా హృదయముతో, నేనున్నానని ముందుకు వచ్చే మనందరి, ప్రియతమ నాయకుడు, గాదరి కిషోర్ కుమార్ పెద్ద మనసును చాటి, పెద్దన్న పాత్ర పోషించి, ముందుకు వచ్చి, సోమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు.

 

, వీరికి తోడు గ్రామస్తులు కూడా మానవతా హృదయముతో దాతలుగా ముందుకు వచ్చి, ఆర్థిక సాయం అందించిన ప్పుడు ఆ పేద కుటుంబానికి, నూతన ఇల్లు నిర్మించే అవకాశం లేకపోలేదు. సోమయ్య కుటుంబానికి బాధ్యతగా మేమున్నామని గ్రామంలోని ప్రతి ఒక్కరు ముందుకు వస్తేనే కుటుంబానికి శ్రీరామరక్ష…. ఎవరైనా, దాతలు పెద్ద మనసుతో ఆర్థికపరమైన సహాయ, సహకారాలు అందించే వారు, ఎంపీటీసీ కేతి రెడ్డి లతా విజయ్ కుమార్ రెడ్డి ఫోన్ పే, గూగుల్ పే నెంబర్,8639942996. సంప్రదించవచ్చని నిజం న్యూస్ తో, ఆమె పేర్కొన్నారు.