జిపి నిధుల వినియోగం సహా చట్టంతో తెలుసుకోండి

గ్రామ పంచాయతీ నిధుల వినియోగం మరియు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడం కోసం….
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రభుత్వశాఖ ల కార్యాలయాలలో జరిగే పనులు, పనితీరు, వచ్చే నిధులు, చేసిన ఖర్చులు… etc *
_గ్రామ పంచాయితీ పరిధిలో నిధులు ఎలా? ఎందుకు? ఏ పనికోసం ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవాలని చాలా మందికి జిజ్ఞాశ ఉంటుంది.
గ్రామ పంచాయతీలలో జరిగే అవినీతి, అక్రమం, నిధుల వినియోగం ఏ ప్రాతిపదికన ఖర్చు చేశారు. ఏమేమి పనులు చేశారు ఎన్ని నిధులు ఖర్చు చేశారు తెలుసు కోవాలని వున్నా చాలా మందికి దరఖాస్తు ఎలా వ్రాసుకోవలోఎక్కడ దరఖాస్తు చెయ్యాలో, ఎలా చేయాలో తెలియక తికమక పడుతుంటారు.
ప్రతి వ్యక్తికి సమాచారం పొందే హక్కును RTI-2005 ద్వారా కల్పించబడినది.
సెక్షన్ 6(1) ప్రకారం లేదా సెక్షన్ 7(1) ప్రకారం మీకు కావలసిన సమాచారం సెక్షన్ 4(4) ప్రకారం తెలుగు భాషలో ఇవ్వమని సమాచారం కొరవచ్చు. దీనికి దరఖాస్తు ఫార్మ్ ప్రత్యేకంగా ఉండదు. తెల్లటి కాగితం మీద మీకు కావలసిన సమాచారం అడగవచ్చు. దరఖాస్తు రుసుము లేదు.
గ్రామ స్థాయి లో దరఖాస్తుకు రుసుము లేదు. మండల స్థాయిలో 5/-కోర్టు ఫీ టికెట్, లేదా పోస్టల్ ఆర్డర్, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 10/-కోర్టు ఫీ టికెట్, లేదా పోస్టల్ ఆర్డర్, పెట్టాలి. తెల్ల రేషన్ కార్డ్ xerox జత పరచితే రుసుము మినహాయింపు కలదు.
పౌర సమాచార అధికారి/ పంచాయతీ కార్యదర్శి
మొదటి అప్పిలేట్ అధికారిగా /
ఎంపీడీవో (మండలఅభివృద్ధి అధికారి)
*_రెండవ అప్పిలేట్ అధికారి/ సమాచార కమిషనర్, HYD.
1. గ్రామ పంచాయతీకి కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ రూపాల్లో వచ్చిన నిధులు వివరాలు నకల్ (జెరాక్స్) కాపీ ఇవ్వగలరు.
2.గ్రామపంచాయతీలో ఏ ఏ పథకాలు క్రింద ఎన్ని నిధులు వచ్చాయో తెలపగలరు మరియు ఈ పథకాలకు ఎంత వ్యయం చేశారో తెలుపుతూ ఈ పథకాల లబ్ధిదారుల వివరాలు నకలు కాపీ ఇవ్వగలరు.
3.గ్రామ పంచాయతీకి ఏ రూపాల్లో ఆదాయం వచ్చిందో పూర్తి సమాచారం ఇవ్వగలరు మరియు వచ్చిన ఆదాయాన్ని ఏ రకంగా వ్యయం చేశారో పూర్తి సమాచారం నకలు కాపీ ఇవ్వగలరు.
4.గ్రామపంచాయతీలో జరిగిన గ్రామ సభ తేదీలు, గ్రామ సభలకు హాజరైన సభ్యుల సంఖ్య, గ్రామ సభలో చేసిన తీర్మానాల నకలు, గ్రామ సభకు హాజరైన ప్రభుత్వ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు వివరాలు మరియు వీరు సంతకాలు చేసిన రిజిస్టరు నకలు కాపీలు ఇవ్వగలరు.
5.గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రజలకు తెలియజేయడానికి మీరు తీసుకున్న చర్యలను తెలుపుతూ వీటికి ఏ రూపంలో వ్యయం చేశారో పూర్తి సమాచారం నకలు కాపీ ఇవ్వగలరు.
6.గ్రామ సభను నిర్వహించడానికి 5, ఎంత వ్యయం చేశారో ఏ రూపంలో ఖర్చు పెట్టారు పూర్తి సమాచారం నకలు కాపీ ఇవ్వగలరు.
ఈ విధంగా దరఖాస్తు చేసి గ్రామపంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్ధి కొరకు సక్రమంగా వినియోగించే విధంగా ప్రతి పౌరుడు యువకుడు నడుము బిగించి గ్రామ పంచాయతీ అభివృద్ధి కి సహకరించాలని తెలియజేస్తున్నాం.