Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సమతా మూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ట

సమతా మూర్తి శ్రీ రామానుజాచార్య విగ్రహ ప్రతిష్ట

జై శ్రీమన్నారాయణ. ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు మన చిన్న జీయర్ స్వామి వారు నిర్వహించే “రామానుజ విగ్రహ ప్రతిష్ట” కార్యక్రమం చాలా గొప్పది. ఇది మానవ మాతృలచే జరిగే పని కాదు, అపర రామానుజులు మన చిన్న జీయర్ స్వామి వారితో భగవంతుడు స్వయం గా నిర్వహిస్తున్న మహాయజ్ఞం. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచే ఘనకార్యం.
సమతా మూర్తి శ్రీ రామాను జాచార్య 1000 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్లే దారిలో 30 కి.మీ.దూరంలో ముచ్చింతల గ్రామంలో ఉన్న పూజ్య చిన జీయర్ ఆశ్రమంలో 216 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. చుట్టూ 108 దేవాలయాలు నిర్మాణం అయ్యాయి, విగ్రహ ప్రతిష్ఠలు జరగనున్నవి.

ముఖ్యాంశాలు

2 నుండి 14 ఫిబ్రవరి వరకు అనేక కార్యక్రమాలు ఆశ్రమంలో జరుగనున్నాయి.

5 ఫిబ్రవరి న ప్రధాని మోడీ గారు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

8, 9 తేదీలలో దేశ వ్యాప్త సాధు సంతులతో ” ధర్మ సమ్మేళనం” జరగనున్నది.

10 వ తేదీన సామాజిక సమర సత దృష్ట్యా “సామాజిక నేతల సమ్మేళనం” జరగనున్నది.

13వ తేదీన బంగారు శ్రీ రామానుజ చార్యలు విగ్రహాన్ని గౌ శ్రీ రాష్ట్రపతి శ్రీ రామనాథ కోవింద్ గారు ఆవిష్కరిస్తారు.

9 వ తేదీన పరమ పూజ్య శ్రీ మోహన్ భాగవత్ గారు మరియు 9,10 తేదీలలో శ్రీ భయ్యాజి జోషి గారు, పాల్గొంటారు

రోజు వేద పండితులచే వేదోచ్చారణ,1035 యజ్ఞ కుండాలలో యజ్ఞ, యాగాదులు ఇలా అనేక ధార్మిక కార్యక్రమాలు ఉంటాయి.

కోవిడ్ రూల్స్ ను పాటించి భక్తులు యజ్ఞ యాగాదులలో పాల్గొన వచ్చు, భక్తులు సందర్శించ వచ్చును.