న్యూజిలాండ్‌లో యూత్ MPగా ఎన్నికైన తెలుగు అమ్మాయి

న్యూజిలాండ్‌లో ఓ తెలుగు అమ్మాయికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన(18) న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైంది. నామినేటెడ్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికలలో భాగంగా, మేఘన ‘సేవా కార్యక్రమాలు, యువత’ విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. వాల్‌కాట్ ప్రాంతం నుంచి మేఘన నామినీ. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ 21 ఏళ్ల క్రితం భార్యతో కలిసి ఉపాధి నిమిత్తం 2001లో న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడటంతో మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగిన మేఘన కేంబ్రిడ్జ్‌లోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి స్కూల్ డేస్‌లో ఛారిటీ ప్రోగ్రామ్‌లు చేసింది. ఆమె తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి అనాథాశ్రమాలకు విరాళంగా ఇచ్చేది. అంతేకాకుండా, ఇతర దేశాల నుండి వచ్చిన శరణార్థులకు విద్య, ఆశ్రయం మరియు ఇతర సౌకర్యాలను అందించడంలో మేఘన ముందుంది. న్యూజిలాండ్ ప్రభుత్వం ఆమెను పార్లమెంటు సభ్యునిగా ఎన్నుకుంది, ఆమె ఫిబ్రవరిలో MPగా ప్రమాణం చేయనుంది.