సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 20 కోట్ల ఆస్తి నష్టం

సికింద్రాబాద్ క్లబ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.20 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. మంటలు క్లబ్‌కు వ్యాపించి పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న 10 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీకెండ్ కావడంతో ఆదివారం ఉదయం వరకు కార్యక్రమాలు జరిగినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. సమీపంలో జూబ్లీ బస్టాండ్ ఉన్నందున ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిపివేశారు. పరిసరాల్లో ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. 1879లో బ్రిటీష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసి దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఇది 2017లో భారతీయ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.