ఈ నెల 30 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగి౦పు

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 30 వరకు తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు సెలవును పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. జనవరి మొదటి వారంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ కంటే మూడు రోజుల ముందుగానే సంక్రాంతి సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 16 వరకు సెలవులు, 17 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది.