నీటి పారుదల శాఖ (ఇరిగేషను) అధికారుల నిర్లక్ష్య వైఖరి

నేరేడుచర్ల పట్టణ కేంద్రం లోని ప్రధాన రహదారి పక్కనే ఉన్నటు వంటి అర్3 మేజర్ కి అనుసంధానంగా 3యల్ డీపీ పంట కాలువ రహదారి భూగర్భం నుండి సీపీఎం పార్టీ కార్యాలయం వీధి గూండా పాత స్వాగత్ ధియేటర్ పక్కనుండి నర్సయ్య గూడెం చెర్వు కుంట వరకు ఈ పంట కాలువ గత 60 సంవత్సరాలుగా ఏకధాటిగా వ్యవస్యాయ భూములకు నీరందించింది అంతే కాకుండా చెర్వు కుంటను నింపి పశు,పక్షాదులకు నీటి వనరులను అందించింది.
ప్రధానంగా నీటి ఎద్దడి సమయంలో భూగర్భ జలాలు ఇంకిపోకుండా కాపాడిన ఘనత ఈ పంట కాలువది. అలాంటి కాలువ పట్టణ అభివృద్ధి పేరుతొ నిర్మాణం అయిన అపార్ట్ మెంట్ల, బిల్డింగ్ ల నిర్మాణాలతో పంట కాలువ వెళ్లవలసిన దిశ మారి, చివరికి దాని స్వరూపమే మారి పంట కాలువను డ్రైన్ గా ఉచ్చరించే స్థాయికి పట్టణ అభివృద్ధి జరిగింది. పంట కాలువను కాపాడవలిసిన నీటి పారుదల శాఖ కుడా ఆ కాలువను ఒక డ్రైన్ గా సంభోదించే వరకూ రావటం చాలా బాధాకరం.
ఇది ఇలా ఉంటే పంట కాలువ ఆక్రమణ వలన కాలువ నీరు సాఫీగా ప్రవహించక కాలువ నీరు నిలిచిపోయి, చెత్తా, చెదారం మార్కెట్ లోని జీవ వ్యర్ధాలు అన్నీ కలిసి దుర్గoదాన్ని పెంచి అనేక వ్యాధులును వ్యాప్తి చేసే బ్యాక్తీరియాలకు, ఈగల ,దోమలకు ఆలవాలంగా మారింది. ఇదంతా ఒకెత్తయితే ప్రధాన రహదారి వద్ద డీపీ పై నిర్మాణం అయిన ఒక షెట్టర్ వద్ద ఇప్పుడు ఏకంగా రహదారి విస్తరణ లొ పంట కాలువను శాశ్వతంగా మూసివేసే ప్రక్రియ చేపట్టిన అర్&బి శాఖ వారు పంట కాలువ ఆక్రమణ దారులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోవటం పెద్ద సమస్యగా భావించిన ఇరిగేశను అధికారులు వీరికి వంత పాడుతు ఈ కాలువను అసలు దగ్గర మూసివేస్తే ఇకపై భవిష్యత్తులో ప్రశ్నిoచేవారు ఉండరని ఇదే అదునుగా అర్&బి వారికి వంత పాడుతున్న నీటి పారుదల శాఖ వారు ఎన్ని మార్లు వీరి దృష్టికి తీసుకు వెళ్లినా స్వయంగా ఫిర్యాదు చేసినా రేపొస్తున్న మాపోస్తున్నా మంటూ తప్పించుకునే నిర్లక్ష ధోరణిలో వారు ఉన్నారు.
ఈరోజు కుడా అదే ప్రదేశంలో కాలువ మూసివేసే పని జరుగుతుంది.అవగాహన ఉన్నవారు చూసి కూడా మాకెందుకు అని చూడనట్లు వెళ్ళిపోతున్నారు ఇది చాలా బాధాకరం, ఇప్పటికైనా నీటి పారుదల శాఖ నిద్ర మత్తు వదిలి 3ఎల్ డీపీ పంట కాలువను రక్షించాలి అని ప్రజలు ప్రభూతాన్ని కోరుతున్నారు.