ఢిల్లీలోని ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో బాంబు

బాంబును నిర్వీర్యం చేసిన NSG బాంబు స్క్వాడ్ 

ఢిల్లీలోని ఘాజీపూర్ ఫ్లవర్ మార్కెట్‌లో ఐఈడీ పరికరంతో ఉన్న బ్యాగ్ కనిపించిందని, ఆ పరికరాన్ని నిర్వీర్యం చేశామని అధికారులు తెలిపారు. జనవరి 26న దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 10.19 గంటలకు పూల మార్కెట్‌లో అనుమానాస్పద బ్యాగ్‌ కనిపించిందని తమకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. NSG బాంబు స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేయగా, ఢిల్లీ పోలీసులు ఉగ్రదాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.