Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలు చేస్తున్న ఎమ్మెల్యే

హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఒక దోపిడీ వ్యవస్థను తయారు చేశాడని,  పోలీస్ లను అడ్డం పెట్టుకొని అరాచకాలు భూకబ్జాలు చేస్తున్నారని, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. గురువారం పాలకవీడు బూత్ ఏండ్రోలర్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా,ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇచ్చింది కాంగ్రెస్ మనం ఎంత గొప్ప వ్యవస్థ సంస్థకి వారసులుగా ఉన్నామనీ,ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా, జాతిపిత మహాత్మా గాంధీ, నవభారత నిర్మాణం చేసిన జోహార్ లాల్ నెహ్రూ,ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్,నేతాజీ సుభాష్ చంద్రబోస్.అబ్దుల్ కలాం ఆజాద్ ఇంతా మంచి గొప్ప గొప్ప వాళ్ళు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించారనీ,ఆ పార్టీలో సభ్యులు గా ఉన్నందుకు చేరుతున్నందుకు గర్వపడాలన్నారు.

పాలకవీడు,మండలం ప్రతి ఎకరం నీరు పారుతుంది అంటే నాగార్జున సాగర్ డ్యామ్ కాదా అది కాంగ్రెస్ పార్టీ నిర్మింనం కాదా,ఈ ప్రాంతానికి రోడ్లు మంచినీరు కరెంట్ బడులు గూడులు కటించింది కాంగ్రెస్ కాదా,చిల్లర రాజకీయాలు నిన్నమొన్న వచ్చిన చిన్న చిన్న పార్టీలు నాయకులు కళ్ళు నెత్తి కెక్కి మాట్లాడుతున్నారనీ,పాలకవీడు మండలం లో కేంద్ర ప్రభుత్వ నాబార్డు నిధుల నుండి మంజూరైన చెక్ డ్యాంలు నిర్మాణంలో సంకినేని కృష్ణరావు కాంట్రాక్టర్ ని పెట్టుకుని అధికారులచే ఇష్టానుసారంగా ప్లేసులు మార్చి కమీషన్ తీసుకున్న ఎమ్మెల్యే,

ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచి పిచ్చి లేసి మాట్లాడుతున్నారనీ, అధికార పార్టీ నాయకుల అరాచకం ప్రజలు గమనిస్తున్నారని,హుజూర్ నగర్ ప్రాంతానికి చాలా గొప్ప గొప్ప వాళ్ళు శాసన సభ్యులుగా ఉన్నారూ అరిబండి లక్ష్మీనారాయణ.జూలకంటి రంగారెడ్డి. విజయసింహారెడ్డి.రేపాల శ్రీనివాస్. ఉత్తంకుమార్ రెడ్డి. నాకంటే గొప్పవారు ఏనాడు కూడా భూకబ్జాలు లేవు లిక్కర్ బిజినెస్ లో వాటాలు లేవు,రాజకీయం అంటే ప్రజలకు మేలు చేసేలా ఉండాలి కానీ,అధికార పార్టీ నాయకులు అధికారులు ఇదేదో తమ జాగిరి అంటే కుదరదు,రాజకీయాల్లో ఒక పార్టీకి ఇంకొక పార్టీ అలయన్స్ జరుగుతాయి, కానీ ఇక్కడ పోలీస్ శాఖ కి టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ జరుగుతున్నాయి.

అధికారులు చట్టం న్యాయం ధర్మం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి, రైతుల పండించిన వరికి రేటు రావడం కోసం ఎమ్మెల్యే మాట్లాడిండా,ఎవరో తింగరోడు రబీ లో వరి వెయ్యి వద్దంటే నేను పార్లమెంట్లో రైతుల పక్షాన పోరాడిన,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ ఒకేసారి జరిగింది,రైతుబంధు డబ్బులు వడ్డీకే సరిపోతున్నాయి రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని,పార్లమెంట్లో నేను వేసిన ప్రశ్నకు పంట బీమా క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే,తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వలన రుణమాఫీ జరగలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు.

డోక్రా మహిళలకు రాయితీ లేదు దళితులకు మూడెకరాల భూమి లేదు ముస్లిములకు గిరిజనులకు రిజర్వేషన్ రాలేదు,అన్నారు.ఈ కార్యక్రమంలో పాలక వీడు ఎంపీపీ గోపాల్ నాయక్,పాలకవీడు మండలకాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్బారావు,వర్కింగ్ ప్రసిడెంట్ దేవులపల్లి జానర్ధన చారి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకులు, సర్పంచ్ఎం. పి. టి. సి. లు, మండల, గ్రామ భూత్ కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘలూ కమిటీ అధ్యక్షులు, మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు