సమాజ సేవలో కంటి వైద్య నిపుణులు
లేజర్ ఐ ఉచిత కంటి వైద్య శిబిరం, ద్వారా గ్రామాల్లోని పేదలకు సేవ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ ఈదుల గౌతమ్ రెడ్డి ,వడ్డేపల్లి రవి కుమార్ వెల్లడి.
తుంగతుర్తి నియోజకవర్గం లోని మండలాల్లోనూ, రానున్న రోజుల్లో గ్రామాలతో సహా, ప్రతి ఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, మందులతోపాటు, కళ్లజోడు లు అందించడం పట్ల రాజకీయాలకతీతంగా, సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తుంగతుర్తి, శాలిగౌరారం, తిరుమలగిరి, అడ్డగూడూరు, మోత్కూర్, అరవపల్లి, మద్దిరాల, నూతనకల్ , మండలాల్లో మొదటి విడతగా తిరుగుతూ, రానున్న రోజుల్లో మండలాల్లోని గ్రామాల తో సహా ప్రతి ఒక్కరికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, తమకు తోచిన విధంగా సమాజసేవలో రాణించడం జరుగుతుందని లేజర్ ఐ హాస్పిటల్ ప్రోగ్రాం డైరెక్టర్ ఈదుల గౌతంరెడ్డి, క్యాంప్ ఆఫీసర్ డాక్టర్ వడ్డేపల్లి రవి లు అన్నారు.
గురువారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ, సుమారు ఎనిమిది వందల మందికి పైగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, వారికి కావలసిన మందులు, డ్రాప్స్, దృష్టిని బట్టి కళ్ళజోడును, పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పేదలకు సేవ చేయాలని తలంచి, ఒక్కొక్క క్యాంపు ద్వారా 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ ,తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా సూర్యాపేట లేజర్ ఐ హాస్పిటల్ ద్వారా ఉచిత పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ఎవరైనా కంటి ఆపరేషన్ కావాలనుకుంటే సూర్యాపేట ,నల్గొండ లోని లేజర్ ఐ హాస్పిటల్ ను సంప్రదించాలని వారు కోరారు. ఏదిఏమైనా సమాజంలో ఎంతోమంది వైద్యనిపుణులు ,తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్న తరుణములో, లేజర్ ఐ కంటి దవాఖాన ద్వారా తాము కూడా తమ సేవలను అందించడం పట్ల పేద ప్రజలు, మేధావులు, వివిధ పార్టీ నాయకులు ,ప్రత్యేకంగా అభినందనలు, తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దవాఖాన ఇన్చార్జులు చంద్రశేఖర్, జనార్ధన చారి ,తదితరులు పాల్గొన్నారు.