వాడపల్లి దేవాలయం లో చోరీ
– హుండీ పగుల గొట్టిన దుండగులు
బ్యూరో: నల్గొండ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయం తలుపులు పగల గొట్టి గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించారు. దేవాలయంలోని హుండీ, కార్యాలయం తాళాలను పగులగొట్టారు. భక్తులు వేసిన కానుకలు దొంగిలించారు. సుమారు rs 40 వెలవరకు దొంగిలించి ఉండవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు. నిత్య పూజలకై తెల్ల వారు ఝామున దేవాలయానికి వచ్చిన పూజారీ ఆలయం తలుపులు, హుండీ తాళం పగుల గొట్టి ఉండటాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వాడపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్షించి వివరాలు సేకరించారు