జైషే మహ్మద్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఉగ్రవాది, పోలీసు మృతి

ముగ్గురు ఆర్మీ జవాన్ల కు గాయాలు
బుధవారం సాయంత్రం కుల్గామ్ జిల్లాలో జైషే మహ్మద్ (జేఎం) ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీస్ కానిస్టేబుల్ మరణించగా, ముగ్గురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. మరణించిన పోలీసును రోహిత్ చిబ్‌గా గుర్తించారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడని, ఆపరేషన్ కొనసాగుతోందని ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
ఎదురుకాల్పుల్లో ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయి.