ఎస్ఆర్ఎస్పి కాలువ మట్టిని తవ్వేస్తున్నారు

విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు
– అక్రమాలకు ఇష్టారాజ్యం
– అధికారుల అండదండలతో అక్రమాలు
మహబూబాబాద్ పెద్దవంగర : అనుమతులు లేవు అడిగేటోలు లేరు ఇంకేముంది ఎస్ఆర్ఎస్పి కాలువ మట్టిని తవ్వేస్తున్నారు లక్షల విలువ చేసే మట్టిని దోచుకుంటున్న ఇలా అక్రమాలకు వ్యాపారులు కాసుల వర్షం కురిపిస్తుండగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు మండల కేంద్రంలోని వివిధ గ్రామ శివారులోని ప్రభుత్వ ప్రైవేట్ భూములలో ఉదయం రాత్రి వేళలో నిత్యం అక్రమాల కు జెసిబి యంత్రాల సహాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు కొందరు చోట బడా నాయకులు అనుచరులు ఈ దందా సాగిస్తున్నారు ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న నియంత్రించే నాథుడే కరువయ్యారు మట్టిని కాపాడవలసిన అధికారులు పట్టించుకోకపోవడంతో జెసిబి యంత్రాల సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు ప్రైవేట్ భవనాలు, రియల్ వెంచర్ల నిర్మాణాలకు తరలిస్తున్నారు మట్టి తవ్వకాలు నిర్వహిస్తున్న వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ దందా సాగిస్తున్నారు మండలంలోని వివిధ గ్రామా శివారులో మట్టి ఎస్ఆర్ఎస్పి కాలువ మట్టిని విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి