సకినాల తయారీ లో మహిళలు బిజీ

గ్రామాల్లోనూ పట్టణాల్లో సైతం సంక్రాంతి పండుగ వచ్చిందంటే రైతులు తాము పండించిన ధాన్యం లో మొదటిసారిగా బియ్యం, పప్పులు, నువ్వులు, బెల్లం , ఇంగువ, మిశ్రమాలతో కూడిన సకినాల తయారీ, బెల్లంతో అరిసెలు, ప్రాచుర్యం పొందాయి.
ముఖ్యంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రతి ఇంటిలో సకినాల తయారీలో, మహిళలు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఇంటి లో చేరి, ఎవరికి తోచిన విధంగా వారు సహాయ సహకారాలు ఒకరికొకరు అందించుకుంటూ, పాటలు పాడుకుంటూ, తెల్ల వస్త్రాలపై, సకినాల పిండితో, చేతితో ముద్దలు చేసుకుంటూ, వేళ్ళ మధ్యన తిప్పుకుంటూ, పచ్చి సకినాల ను మొదట తయారు చేసుకుంటారు, ఆరుతూ ఉన్న తర్వాత, పొయ్యి పై పెద్ద మూకుడు పెట్టి, నూనెను మరిగించి, అనంతరం సకినాల చెట్లను మూకుడులో వేసి, లైట్ ఎర్రగా కాలే వరకు వేయించి, ప్రత్యేకమైన పాత్రలో వాటిని వేస్తూ, తయారు చేస్తూ, మహిళలు ఆనందంగా సకినాలు తయారు చేస్తున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి పండుగ రైతులకు, పిల్లలకు, పెద్ద పండుగ గా చెప్పుకోవచ్చు…