సవతి తండ్రే … మైనర్ బాలికపై ..

నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ నగర్ లో ఒరిస్సా నుంచి వచ్చిన ఒక బాలికపై సవతి తండ్రి అత్యాచారం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే తల్లి ఒరిస్సాకు వెళ్లడంతో బాలికపై అత్యాచారం చేసినట్టు తెలుస్తుంది. బాలిక పరిస్థితిని చూసి చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి తల్లికి సమాచారం అందించడంతో, ఒరిస్సా నుంచి వచ్చి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు. ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుచర్ల కు చెందిన ఒంటిపులి కోటేశ్వరరావు మేస్త్రి గా జీవనం సాగిస్తూ, అతనికి ముగ్గురు సంతానం ఉన్నా, ఒరిస్సా మహిళతో సంబంధం పెట్టుకుని ఆమెను నేరేడుచర్ల కు తీసుకు వచ్చి ఇక్కడే ఆమెతో కలిసి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ముగ్గురు పిల్లలు ఉన్న మహిళ భర్తను వదిలేసి వచ్చి ఇతనితో ఉంటూ అప్పుడప్పుడు ఒరిస్సాలోని పిల్లలు భర్త దగ్గరకు వెళ్లి వచ్చేదని, ఈ తరుణంలో ఒరిస్సాలో ఉన్న పిల్లలను కూడా తీసుకువచ్చి నేరేడుచర్ల లో ఉంచడం, ఈ నెల 7న మహిళ ఒరిస్సా వెళ్ళేటప్పుడు పిల్లల్ని మంచిగా చూసుకోమని కోటేశ్వరరావుకు చెప్పి తను ఒరిస్సా వెళ్ళింది. ఈ విషయం తెలిసిన మహిళ నేరేడుచర్లకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్ఐ నవీన్ కుమార్ తెలిపారు.