పోలీసులకు సవాల్ విసిరిన దొంగ

రక్షకభటుడు ఇంట్లో దొంగతనం
నేరేడుచర్ల పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున రక్షక భటుడు ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ దొంగతనం లో బంగారం, నగదు అపహరించుకుని పోయి పోలీసులకు సవాల్ విసిరాడు ఓ దొంగ. పాలకీడు మండల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న బుర్రి ఉపేందర్ పట్టణంలోని ప్రగతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వెనుకభాగంలోని ఒక అద్దె గృహంలో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఉపేందర్ సోమవారం నైట్ డ్యూటీకి వెళ్లగా భార్య కోటేశ్వరి కోదాడలోని బంధువుల ఫంక్షన్కు వెళుతూ ఇంటికి తాళం వేసి వెళ్ళింది. గృహానికి తాళం వేసిన విషయాన్ని గమనించిన దొంగ మంగళవారం తెల్లవారుజామున ఇంటి తలుపు గడియ విరగ్గొట్టి లోనికి చొరబడ్డ దొంగలు బీరువాలో దాచి ఉంచిన 4 లక్షల నగదు,25 తులాల బంగారు వస్తువులను దోచుకెళ్లారు.తాళం పగలకొట్టి,తలుపు తీసి ఉంచిన విషయాన్ని గమనించిన ప్రక్క నివాసం ఉంటున్న వారు కానిస్టేబుల్ ఉపేందర్ కు సమాచారం అందించారు.గృహానికి వచ్చిన ఉపేందర్ నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్,హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి లు సంఘటనా స్థలాన్ని సందర్శించి,క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరించారు. కానిస్టేబుల్ ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడుచర్ల ఎస్సై తెలిపారు.