మకర సంక్రాంతి కి హరిద్వార్ లో గంగా స్నానం నిషేధం

హరిద్వార్ లో మకర సంక్రాంతి సందర్భంగా గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించడంపై పూర్తి నిషేధం విధించింది. కరోనావైరస్ వ్యాధి యొక్క మూడవ వేవ్ (కోవిడ్-19)  ఓమిక్రాన్ వేరియంట్ ప్రభావం  దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోబడిందని హరిద్వార్ DM వినయ్ శంకర్ పాండే  ఉత్తర్వు లు జారీ చేశారు. ‘హర్ కి పౌరి’ ప్రాంతంలోకి కూడా ప్రవేశం నిషేధించబడిందని తెలిపారు.  జనవరి 14 న రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు జిల్లాలో రాత్రి కర్ఫ్యూ విధించబడుతుంది తెలిపారు..