Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎంఎల్ఏకి ఇదే మొదటి చివరి ఎన్నిక-ఎంపి ఉత్తమ్

– యం.ఎల్.ఏ సైదిరెడ్డి అంత అవినీతి పరుడు ఎక్కడ లేడు

– రైతు వారోత్సవాలు చేయడం సిగ్గు చేటు

హుజూర్ నగర్ నియోజక వర్గం లో యం.ఎల్.ఏ సైదిరెడ్డి భూ కబ్జాలు, స్యాండు,ల్యాండు,మైనింగ్ , వైన్స్ మాఫియా గా మార్చిండని,  పోలీసులు యం.ఎల్.ఏ సైదిరెడ్డి కి తొత్తులుగా మారి,  బొకేలు,స్వీట్లు పంచుటకు క్యూ లైన్ కట్టారని …యం.ఎల్ ఏ సైదిరెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ నాయకులు పై అక్రమ కేసులు పెడుతున్నారని సోమవారం జూమ్ మీటింగ్ లో ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా యం.పి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ లో మాట్లాడుతూ
వరి పంట వేయొద్దని, వరి ధాన్యం వేస్తే పంట కొనుగోలు చేయమని చెప్పిన తెరాస నాయకులు యం.ఎల్.ఏ లు, మంత్రులు,యం.పి లు రైతు వారోత్సవాలు చేయడం సిగ్గు చేటని అన్నారు..

లక్ష రూపాయలు రైతుల రుణాలు ఏక కాలం లో మాఫీ చేస్తా అని చెప్పి రెండోవసారి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వం మూడేండ్లు గడిచిన చేయలేదని రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో వేసిన వడ్డీ కింద బ్యాంకర్లు జమ చేసుకొంటున్నారని ఇవి తెరాస నాయకులకు,యం.ఎల్.ఏ మంత్రులకు కంటికి కనపడడం లేదా అని ఉత్తమ్ మండి పడ్డారు..

కేంద్రం వరికి మద్దతు ధర 1960 ప్రకటిస్తే కనీసం 20% మంది రైతులకు రాలేదని అన్నారు..

రబీ పంట వేయొద్దని వేస్తే కొనుగోలు చేయమని యం.ఎల్.ఏ లు మంత్రులు మాటలు మాట్లాడారని అన్నారు..

పార్లమెంటు లో తెలంగాణ రాష్ట్రం నుండి పార్లమెంటు సభ్యునిగా రైతులు పడుతున్న కష్టాలు,నష్టాలు గురించి పార్లమెంటు లో వినిపించిన ఏకైక యం.పి తానే అని అన్నారు..

1994 నుండి రాజకీయాల్లోకి వచ్చానని ఓడిన, గెలిచిన తాను ఏ స్థాయిలో ఉన్న ప్రజల కోసమే పని చేశానని గుర్తు చేశారు..

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయం అని జ్యోస్యం చెప్పారు..

మిర్యాలగూడ శాసన సభ లో హుజూర్ నగర్ నియోజక వర్గం (నాడు) ఉన్న యం.ఎల్.ఏ లు ఎవరు ఇంత అవినీతికి పాల్పడలేదని గుర్తు చేశారు..

యం.ఎల్.ఏ సైదిరెడ్డి అహంకారం తో అవినీతి తో భూ కబ్జా , స్యాండు,ల్యాండు,మైనింగ్స్,లిక్కర్ మాఫియా లకు తెర లేపారని ఆరోపించారు..

పోలీసులు యం.ఎల్.ఏ సైదిరెడ్డి కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జనవరి 1 వ తేదీన పోలీసులు సైదిరెడ్డి ని కలిసి పూల బొకేలు ,స్వీట్లు ఇచ్చేందుకు క్యూ కట్టారని..తమ విధులు నిర్వహించకుండా అలయ్.. బలాయ్ లు ఏమిటి అని ప్రశ్నించారు..

హుజూర్ నగర్ నియోజక వర్గం లో అవినీతి రాజ్యమేలుతోందని, ఎవరైనా అవినీతిని ప్రశ్నిస్తే వారి పై దాడులు అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

హుజూర్ నగర్ నియోజక వర్గ ప్రజలు చైతన్య వంతులు అని వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీని 50 వేల ఓట్ల మెజార్టీ తో గెలిపించడం ఖాయం అన్నారు..

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు నుండి హుజూర్ నగర్ మున్సిపాల్టీ కి 25 కోట్లు,నేరేడు చర్ల మున్సిపాల్టీ కి 15 కోట్లు మంజూరు చేశారని ఈ నిధులను మున్సిపాల్టీ పాలక వర్గాలు పనులు చేయాల్సి ఉండగా ఆ నిధులను హుజూర్ నగర్ యం.ఎల్.ఏ సైదిరెడ్డి ఇతర శాఖకు బదిలీ చేయించి సంకినేని కృష్ణా రావు వద్ద 5% కమీషన్ మాట్లాడి కలెక్టర్ కు లేఖ రాసి నిధులు మళ్లించే ప్రయత్నం చేసి కనీసం మున్సిపాల్టీ పాలక వర్గం ప్రేమేయం లేకుండా పనులు చేస్తుంటే సంబంధిత కాంగ్రెస్ కౌన్సిలర్లు మా మున్సిపాల్టీ నిధులను యం.ఎల్.ఏ ఇతర శాఖకు ఎలా బదిలీ చేస్తారు అని హైకోర్టు ను ఆశ్రయించారు..హై కోర్టు అట్టి పనులకు స్టే ఇచ్చిందని తెరాస నాయకులు కార్యకర్తలు విషయం తెలియకుండా పిచ్చి పిచ్చి మాట లు మాట్లాడుతున్నారని అన్నారు..

రెబల్లె, అడ్లురు, చింతిర్యాల లో ఎప్పుడో లిఫ్టులు మంజూరు చేయించి నిర్మాణం చేయించిన అని కొన్ని మిగిలిపోయిన పనులకు అప్పుడే నిధులు మంజూరు అయ్యాయని ఆ నిధుల తోనే మిగిలిన పనులు చేశారని దీనికి యం.ఎల్.ఏ సైదిరెడ్డి చేశా అని చెప్పడం హాస్య స్పదం అన్నారు..

రాబోయేది కాంగ్రేస్ ప్రభుత్వం అని అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలని ఒక్కొక్కరిని గుర్తు పెట్టుకుంటాం మిత్తి తో వసూలు చేస్తాం అన్నారు..

కాంగ్రేస్ పార్టీ నాయకులు కష్ట పడి పని చేయాలని..కష్ట పడి పని చేసిన వారిని గుర్తించి వారికి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు..

సభ్యత్వం నమోదు లో తెలంగాణ లో హుజూర్ నగర్ నియోజక వర్గం ను ప్రథమ స్థానం లో ఉంచాలన్నారు..

13,14,15 తేదీల్లో హుజూర్ నగర్ నియోజక వర్గం లో అన్ని మండలాల్లో పర్యటన చేసి సభ్యత్వం నమోదు ప్రక్రియ పై బూతుల వారిగా సమీక్ష చేస్తా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి జూమ్ మీటింగ్ లో అన్నారు ..