35 సంవత్సరాల క్రితం కొన్న భూమిని లాక్కోవాలని చూస్తున్నారు

న్యాయం చేయాలని రిటైడ్ ఉద్యోగి ఆవేదన

మహబూబాబాద్: గత 35 సంవత్సరాల క్రితం నేను ఖరీదు చేసిన భూమిని కొందరు లాక్కోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని రిటైడ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన శ్రీరాం మధుసూదన్ రావు గత 35 సంవత్సరాల క్రితం ఎదునూరి బుచ్చయ్య దగ్గర సర్వే నెంబర్ 56,70/ఏ లలో 6 ఎకరాల30 గుంటల భూమిని ఖరీదు చేశానని తెలిపాడు. అయితే అతని మనవడు ఇప్పుడు ఆ భూమిని మా తాత నీకు అమ్మలేదని నువ్వు తప్పుడు ఆధారాలు సృష్టించిన కబ్జా చేసుకున్నావని ఎదురు తిరుగుతున్నాడని తెలిపాడు. భూమికి సంబందించిన రిజిస్ట్రేషన్ పత్రాలు అన్నీ నా దగ్గరే ఉన్నాయని, నాకు రిజిస్ట్రేషన్ చేసిన ఎదునూరి బుచ్చయ్య అంతకు ముందే ఎలా చనిపోతాడని వారికి రెవెన్యూ అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం ఎలా మంజూరు చేసారని అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసాడు. నాభూమి నాకే చెందేలా న్యాయం చేయాలని  అధికారులను వేడుకున్నాడు