Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ముంబై-జామ్‌నగర్ విమానం పుష్‌బ్యాక్ టగ్‌లో మంటలు

తెల్లవారుజామున ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా  ముంబై-జామ్‌నగర్ విమానం పుష్‌బ్యాక్ టగ్‌లో మంటలు చెలరేగాయి. 10 నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తెచ్చిందని ముంబై ఎయిర్‌పోర్ట్ పీఆర్వో పేర్కొన్నారు.

ముంబై-జామ్‌నగర్ ఫ్లైట్‌లో 85 మంది ప్రయాణికులు ఉన్నారు. 10 నిమిషాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని, రోజు వారీ  కార్యకలాపాలు సాధారణంగానే జరుగుతున్నాయని  చెప్పారు.