వారంలో ఢిల్లీలో రోజుకు 60 వేలు, ముంబై లో 30 వేల కేసులు
భారతదేశంలో కోవిడ్-19 మూడవ వేవ్ పీకు దశకు ఈ నెలాఖరు చేరుకుంటుందని, అది నాలుగు నుండి ఎనిమిది లక్షల (ఏడు రోజుల సగటు) కేసుల వరకు చేరుతుందని, ఢిల్లీ , ముంబైలలో గరిష్ట స్థాయి జనవరి మధ్యలో ఉంటుందని అంచనా. వేశారు. ఢిల్లీ , ముంబైలలో రోజువారీ కేసులు వరుసగా 50,000-60,000 మరియు 30,000 కేసులు (ఏడు-రోజుల సగటు) ఉండే అవకాశం ఉందని IIT కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఆదివారం తెలిపారు.
దేశంలోని నగరాల్లో కేసులు బాగా పెరిగి పీకు స్టేజ్ కు చేరుకున్న తర్వాత కేసుల సంఖ్య త్వరగా తగ్గుతుందని తెలిపారు.
అఖిల భారత స్థాయిలో పడకల అవసరాలు దాదాపు 1.5 లక్షలకు చేరుకోవచ్చని, అయితే ఢిల్లీలో “12,000 కంటే తక్కువ” ఉండవచ్చని పేర్కొంది.
కేసుల పెరుగుదలకు మరియు ఎన్నికల ర్యాలీలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏదీ ప్రొఫెసర్‌కు కనిపించడం లేదని, వ్యాప్తికి కారణమైన అనేక విషయాలలో ఎన్నికల ర్యాలీ ఒక భాగమన్నారు. .