ఈటల గెలుపుతో కేసీఆర్‌ మైండ్‌ పనిచేయడం లేదు

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శ
: సీఎం కేసీఆర్‌పై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శలు గుప్పించారు. ప్రజలను సీఎం కేసీఆర్‌ మోసం చేస్తున్నారని ఆరోపించారు. 317 జీవోకు వ్యతిరేకంగా వరంగల్‌లో బీజేపీ నిర్వహించిన సభలో అస్సాం సీఎం పాల్గొన్నారు. ఈటెల గెలుపుతో కేసీఆర్‌ మైండ్‌ పనిచేయడం లేదన్నారు. అస్సాంలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ కేసీఆర్‌ ఇచ్చిన హామీని నెరవేర్చుకోలేదన్నారు.